ఉపాధ్యాయుల పాత్ర కీలకం


Tue,January 10, 2017 02:32 AM

సిరిసిల్లటౌన్: ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణలో ఉపాధ్యాయులది కీలకపాత్ర అని ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నూతన సంవత్సరం క్యాలెండర్లు, డైరీలను జిల్లా కేంద్రంలో ఎంపీ ఆవిష్కరించి మాట్లాడారు. విద్యారంగ అభివద్ధిపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టిసారించారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య, మౌలిక వసతుల ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. ఉపాధ్యాయులు జిల్లాను ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిపేలా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పాకాల శంకర్‌గౌడ్, మదుసూధన్, పొలాస మల్లే శం, జంగిటి రాజు, వెంకటేష్, రవీందర్‌గౌడ్, శివకుమార్, సత్యనారాయణ పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS