పేద విద్యార్థులకు అండగా ఉంటాం

Tue,January 10, 2017 02:31 AM


బోయినపల్లి : రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు బాసటగా నిలుస్తుందని కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే బొడిగ శోభ అన్నారు. సోమవారం సాయంత్రం మండలంలోని కస్తూ ర్బా పాఠశాల విద్యార్థినులకు ప్రభుత్వం మం జూరు చేసిన దుప్పట్లను ఎమ్మెల్యే విద్యార్థినులకు పంపిణీ చేసి మాట్లాడారు. రెసిడెన్షీయల్ పాఠశాలలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్య ను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని చెప్పారు. విద్యార్థులకుఅందించే కాస్మోటిక్, మెనూ కూడా ట్రస్టు అవసరాలకు అనుగుణంగా అందిస్తుందని తెలిపారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు సన్నబియ్యం ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. అనంతరం విద్యాబోధనను, హాస్టల్‌లో అందించే భో జనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే విద్యార్థులతో మాట్లాడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేకాధికారి వినోద, విద్యాధికారి సుధాకర్‌రావు, వీఆ ర్వో రవీందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు శంకర్ శ్రీనివాస్‌రెడ్డి, నగేశ్, టీఆర్‌ఎస్ నేతలు ఉన్నారు.

247
Tags

More News

మరిన్ని వార్తలు...