ట్రాఫిక్ ఎస్సైపై చర్యలు తీసుకోవాలని ఆందోళన


Tue,January 10, 2017 02:30 AM

సిరిసిల్లటౌన్: వాహనదారులపై భౌతికదాడులు చేస్తున్న సిరిసిల్ల ట్రాఫిక్ ఎస్సై లింగమూర్తిని సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ నేత కెకె.మహేందర్‌రెడ్డి డిమాండ్‌చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎస్సై తీరును వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులపై ఇష్టారాజ్యం గా వ్యవహరిస్తున్నారని, ముందస్తుగా ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన అనంతరం నిబంధనలు ఉల్లంగిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై దాడి చేయ డం సరికాదన్నారు. ఉన్నతాధికారు లు ఓ వైపు ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలుచేయాలంటే, స్థానిక ట్రాఫిక్ ఎస్సై ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఎస్సైపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో భైరినేని రాము, మేకల కమలాకర్, మునిగెల రాజు, సోమిశెట్టి దశరథం పాల్గొన్నారు.

చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు


సిరిసిల్ల క్రైం: వాహనదారులతో దురుసుగా ప్రవర్తిస్తున్న వేములవాడ పట్టణ సీఐ శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్‌ఐ చిట్టి బాబులపై వెంటనే చర్యలు తీసుకోవాలని చందుర్తి మండలం మల్యాలకు చెందిన యువ నాయకుడు ఈర్లపల్లి రాజు సోమవారం ఎస్పీ విశ్వజిత్ కంపాటికి ఫిర్యాదు చేశారు. ఈనెల 7న సాయంత్రం వేములవాడలోని కోరుట్ల బస్టాండ్ వద్ద ట్రాఫిక్ ఎస్‌ఐ చిట్టిబాబు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల సమయంలో వాహనదారులతో దురుసుగా ప్రవర్తిస్తూ, చితకబాదడని ఆరోపించారు. ఈ విషయం గురించి కొందరు విలేకరుల తో కలిసి రాజు ఠాణలోకి వెళ్లగా, అక్కడ ఉన్న వేములవాడ పట్టణ సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ చిట్టిబాబులు అసభ్య పదజాలంతో తిట్టి, కేసులు పెడతానని బెదరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS