బస్సు డిపో ఏర్పాటుకు స్థల పరిశీలన


Tue,January 10, 2017 02:30 AM

గంభీరావుపేట: గంభీరావుపేటకు మంజూరైన ఆర్టీసీ బస్సు డిపో నిర్మాణానికి సోమవారం ఆర్టీసీ అధికారులు స్థలపరిశీలన చేశారు. మంత్రి కేటీఆర్ సహకారంతో మంజూరైన డిపో ఏర్పాటుకు కావా ల్సిన స్థలాన్ని అధికారులు ఆర్టీసీ ఈఈ సబ్రహ్మణ్యేశ్వర్‌రావు ఆధ్వర్యంలో గుర్తించారు. మండల కేంద్రంలోని కాకుల గుట్ట సమీపాన, ముస్తాఫానగర్ గ్రామ శివారులో ఐదెకరాల ప్రభుత్వ భూమి ని అధికారులు గుర్తించారు. ఉన్నాతాధికారుల అభిప్రాయం మేరకు రెండింటిలోని ఏదైన ఒక స్థలాన్ని ఎంచుకొని త్వరలో మండల కేంద్రంలో డిపో నిర్మాణం చేస్తామని ఆర్టీసీ ఈఈ తెలిపారు. ఇందులో మాజీ జడ్పీటీసీ మల్లుగారి నర్సాగౌడ్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు గోగు లింగంయాదవ్, ఆర్టీసీ డీఈ లక్ష్మణ్, సిరిసిల్ల డిపో మేనేజర్ రమణ, ఉపసర్పంచ్ అక్కపల్లి బాలయ్య, మండ ల కోఆప్షన్ సభ్యుడు మహబూబ్‌అలీ, ఎంపీటీసీ వనం సావిత్రి, మండల సర్వేయర్ విశ్వనాథం తదితరులు ఉన్నారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS