సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల అందజేత

Tue,January 10, 2017 02:29 AM

వేములవాడ రూరల్ : వేములవాడ మండలం శాత్రాజుపల్లి, మల్లారం గ్రామానికి చెందిన పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే రమేశ్‌బాబు అం దజేశారు. శాత్రాజుపల్లి ఎంపీటీసీ సాయిబీ, మల్లారం ఎంపీటీసీ కనపర్తి లలిత మాట్లాడుతూ శాత్రాజుపల్లికి చెందిన బొడ్డు బాబుకు రోడ్డు ప్రమాదంలో గాయాలుకాగా దవాఖాన ఖర్చుల కోసం రూ.25వేలు, మ ల్లారం గ్రామానికి చెందిన కొప్పెర మల్లారెడ్డి అనారోగ్యంతో బాధపడుతండగా వైద్య ఖర్చులకు రూ.62 వే లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపా రు. నాయకులు ఎండీ సలీం, కనపర్తి అంజయ్య, వీ రేందర్, తదితరులు పాల్గొన్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...