ప్రతిభా పరీక్షల్లో విద్యార్థుల సత్తా


Tue,January 10, 2017 02:29 AM

వేములవాడ, నమస్తేతెలంగాణ : చుక్కారామయ్య ప్రతిభ పరీక్షల్లో వేములవాడ కిడ్స్ కాన్వెంట్ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. హైద్రాబాద్‌లోని డాక్టర్ చు క్కారామయ్య నేతృత్వంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ కెమికల్ టెక్నాలజీలో జరిగిన ప్రతిభ పరీక్షల్లో కిడ్స్ కా న్వెంట్ విద్యార్థులు స్వాతిక, సరయు, శివసాయి, లా స్య, అనూహ్య, చంద్రిక ప్రతిభ చాటారు. చుక్కా రా మయ్య చేతులమీదుగా మెమొంటోలను, ప్రశంసా ప త్రాలను అందుకున్నారు. సదరు విద్యార్థులను ప్రిన్సిపాల్ దరక్షన్ వస్‌ఫియా, డైరెక్టర్లు ఫసీ, నరాల దేవేందర్, ఉపాధ్యాయులు అభినందించారు.

వేములవాడ కల్చరల్ :

చుక్కాలక్ష్మీబాయమ్మ సైన్స్‌టాలెంట్ టెస్ట్‌లో వేములవాడలోని వాగ్దేవి హైస్కూల్‌లోని 4 వతరగతి విద్యార్థిని యం.ఏ.యాష్రాజుఫీ తృతీయ ర్యాంక్ సాధించింది. ఆదివారం హైద్రాబాద్‌లోని తార్నాకలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టె క్నాలజీలో ప్రశంసాపత్రాన్ని బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రా ములు అందజేసారు. 2016 నవంబర్ 27న నిర్వహించిన సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో యా ష్రాజుఫీ మూడో ర్యాంక్ సా ధించింది. తార్నాకలోని సీఏల్‌బీ అవార్డ్ కౌన్సిల్ ఆధ్వర్యం లో నిర్వహించిన ఏడో సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్ష, చుక్కాలక్ష్మీబాయ్ అవార్డ్‌ల పంపిణీకి బీసీ కమిషన్ చైర్మన్ రా ములు, చుక్కా రామయ్య ముఖ్యఅతిథిగా హాజరై అ వార్డును ప్రదానం చేశారు. సభాధ్యక్షుడిగా వేములవా డకు చెందిన ఆంగ్లోపన్యాసకులు అప్పాల క్రిష్ణచం ద్ర పాల్గొన్నారు. ర్యాంకర్‌ను స్కూల్ యాజమాన్యం, ఉ పాధ్యాయులు అభినందించారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS