వికాస్‌లో రిక్రూట్‌మెంట్ డ్రైవ్


Tue,January 10, 2017 02:29 AM

సిరిసిల్లటౌన్ : జిల్లా కేంద్రంలోని వికాస్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 12న టాస్క్ ఉద్యోగ శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ దిడ్డి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాల్ హెల్త్ కంపెనీలో వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 8వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. అదే విధంగా బీఎస్సీ సైన్స్ అర్హత ఉన్నవారికి ఆయా విభాగాల్లో శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని అన్నారు. వయస్సు 18 నుంచి 30 సంవత్సరాలలోపు ఉండాలని తెలిపారు. నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం మొబైల్ నంబర్ 9949995801ను సంప్రదించాలని పేర్కొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS