విద్యార్థుల్లో మానవతా విలువలు పెంపొందించాలి


Tue,January 10, 2017 02:28 AM

సిరిసిల్లటౌన్ : విద్యారంగ అభివృద్ధితో పాటు విద్యార్థులలో మానవతా విలువలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి రాధాకిషన్ అన్నారు. సోమవారం డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2017 క్యాలెండర్లు, డైరీలను ఆయన ఆవిష్కరించారు. రాష్ట్ర సాధన స్ఫూర్తితో రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధిలో సామాజిక బాధ్యత వహించాలని సూచించారు. రానున్న కాలంలో జరుగనున్న పరీక్ష ఫలితాల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలిపేలా విద్యార్థులను సిద్ధం చేయాలని తెలిపారు. డీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు అయిల్నేని రాజేశ్వర్‌రావ్, బూర సదానందం, మండల విద్యాధికారి రాంచందర్‌రావ్, రమాకుమారి, రఘుపతి, దేవేందర్, ఆనందం, తదితరులు పాల్గొన్నారు.

211
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS