రైతులు ఆదర్శంగా నిలవాలి


Fri,December 13, 2019 01:30 AM

కాల్వశ్రీరాంపూర్‌: రైతులు వ్యవసాయ రంగంలో మెళకువలు పాటిస్తూ ఆదర్శంగా నిలవాలని రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు కోట రాంరెడ్డి అన్నారు. మండలంలోని కిష్టంపేటలో కొప్పుల సత్యనారాయణ అనే రైతు తానే సొంతంగా తయారుచేసిన ‘ఎంటీయూ1290’తోపాటు పలు రకాల వరిపంటను గురువారం కోట రాంరెడ్డి పరిశీలించారు. సత్యనారాయణ సాగు చేస్తున్న విధానాన్ని తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న సత్యనారాయణను ఈప్రాంత రైతులు స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. రబీలో కూలీల సమస్యలు అధిగమించేందుకు వడ్లు పొలంలో వెదజల్లడంతోపాటు డ్రమ్‌ సీడర్‌ ఉపయోగించుకోవాలని సూచించారు. దీనిద్వారా ఖర్చు ఆదా అవుతుందని పేర్కొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...