మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి


Thu,December 12, 2019 02:12 AM

మఠంపల్లి : రాష్ట్రంలో మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మట్టపల్లి కృష్ణానదిలో ప్రత్యేక పూజలు నిర్వహించి 100శాతం రాయితీతో కూడిన చేప పిల్లలను కృష్ణానదిలో వదిలారు. అనంతరం గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఈఏడాది రూ.5కోట్ల విలువైన రొయ్యలు, చేప పిల్లలను పంపిణీ చేసినట్లు తెలిపారు. కులవృత్తులను ప్రోత్సహించి గ్రామాలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మత్స్యకారులు చేపలు అమ్ముకునేందుకు వాహనాలను ఉచితంగా అందజేసిందన్నారు. అనంతరం మట్టపల్లి గ్రామ పంచాయతీలో మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో మఠంపల్లి, హుజూర్‌నగర్‌ ఎంపీపీలు ముడావత్‌ పార్వతీకొండానాయక్‌, గూడెపు శ్రీను, జడ్పీటీసీలు జగన్‌నాయక్‌, కోటిరెడ్డి, సర్పంచ్‌ దాసరి విజయలక్ష్మి, వెంకటరమణ, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మన్నెం శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు వెంకటనారాయణ, నాగరాజు, ఎంపీడీఓ జానకిరాములు, అంగన్‌వాడీ టీచర్లు, వార్డుమెంబర్లు పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...