ప్రజా సమస్యలపై తక్షణం స్పందించాలి


Thu,December 12, 2019 02:12 AM

సూర్యాపేట, నమస్తేతెలంగాణ : తాసిల్దార్లు, సంబంధిత సిబ్బంది వివిధ సమస్యలపై రైతులు అందించే దరఖాస్తులతోపాటు ప్రజా సమస్యలపై వచ్చే దరఖాస్తులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని కలెక్టర్‌ దుగ్యాల అమయ్‌కుమార్‌ ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, పట్టదారు పాస్‌పుస్తకాలు, డిజిటల్‌ సంతకాలు, సాదా బైనామాలు, మీసేవ తదితరాలపై జేసీ సంజీవరెడ్డి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌తో కలిసి సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఈనెల 19న సూర్యాపేట, 20న కోదాడ డివిజన్‌లలో రెవెన్యూ అధికారులు సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు.

బదిలీలపై వచ్చిన ఆర్‌ఐలు, వీఆర్‌ఓలు తక్షణమే చార్జ్‌ తీసుకోవాలని, ఇవ్వని సిబ్బందిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. పాత రికార్డులతో కొత్త రికార్డులు(ఆర్‌ఎస్‌ఆర్‌) సరిచూసుకొని వ్యత్యాస భూములపై సర్వే నిర్వహించి చర్యలు చేపట్టాలన్నారు. రైతులు చేసుకున్న దరఖాస్తులను వారి గ్రామాలకు వెళ్లి పూర్తిస్థాయి పరిశీలన చేసి అనంతరం తాసిల్దార్లకు నివేదిక అందించాలని, ఇకపై రైతుల దరఖాస్తులు వీఆర్‌ఓల వద్ద పెండింగ్‌ ఉంటే కారణాలు చూపాలని, లేనిపక్షంలో తీవ్రంగా పరిగణించనున్నట్లు తెలిపారు. ఈనెల 31నాటికి అన్ని మిగిలి ఉన్న పనులు పూర్తిచేయాలని తాసిల్దార్లను ఆదేశించారు. వివిధ కారణాలతో మిగిలిపోయిన పట్టాదారు పాస్‌పుస్తకాలను వెంటనే కలెక్టరేట్‌లో అందించాలన్నారు. అనుకూలంగా ఉన్న భూములకు సంబంధించి డిజిటల్‌ సంతకాలు వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. ఇకపై తాసిల్దార్‌ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు. నిర్దేశించిన సమయంలో మిగిలిన పనులు చేపట్టని సిబ్బందికి వార్షిక ఇంక్రిమెంట్‌ నిలిపివేస్తామన్నారు. అనంతరం మండలాల వారీగా వివిధ సమస్యలపై తాసిల్దార్లతో సమీక్షించారు. సమావేశంలో డీఆర్‌ఓ పి.చంద్రయ్య, తాసిల్దార్లు శ్రీకాంత్‌, వెంకన్న, సైదులు, యాదగిరి, హరి, ఆర్‌ఐలు, వీఆర్‌ఓలు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...