పర్వతాల మల్లన్న తీర్థాలు ప్రారంభం


Thu,December 12, 2019 02:08 AM

ధర్మారం : మండల కేంద్రంలో పర్వతాల మల్లన్న తీర్థాలు ప్రారంభమయ్యాయి. గుట్టపై మల్లన్న దేవుడికి నూతనంగా గుడి నిర్మిస్తున్న నేపథ్యంలో స్థానిక యాదవ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 2న గుట్టపై మల్లన్న కల్యాణోత్సవం నిర్వహించారు. దీంతో మలన్న దండి వారాలు మొదలయ్యాయి. ఆదివారం, బుధవారాల్లో గుట్ట వద్ద మల్లన్న తీర్థాలు కొనసాగుతున్నాయి. దీంతో బుధవారం భక్తులు పెద్ద సంఖ్యలో తీర్థాలకు వెళ్లారు. గుట్టపై గర్భగుడిలో భక్తులు మొక్కులు సమర్పించారు. గుట్ట కింద భక్తులు బోనాలు వండి మల్లన్నకు నైవే ద్యం పెట్టి మొక్కులు సమర్పించారు. ఒగ్గు పూజారులు బోనాల వద్ద పట్టు పరిచి పట్నాలు వేశారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...