కరాటేతో ఆత్మరక్షణ


Mon,December 9, 2019 12:38 AM

-విద్యార్థినులకు ఎంతో దోహదపడుతుంది
-ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
-జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయ కరాటే పోటీలు ప్రారంభం
-రాష్ట్ర నలుమూలల నుంచి 800 మంది విద్యార్థులు హాజరు

పెద్దపల్లిటౌన్‌ : విద్యార్థులు, మహిళల ఆత్మరక్షణకు కరాటే, కర్రసాము, అకాడ, కరళియపట్టు లాంటి యుద్ధ విద్యలు ఎంతగానో ఉపయోగపడుతాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన డ్రా గెన్‌ ఫీస్ట్‌ షాటోకాన్‌ కరాటే అకాడమీ ఇండియా 9వ రాష్ట్ర కరాటే పోటీలను ఆయన ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితం కరాటేపై ఎక్కువ మక్కువ ఉండేదనీ, నేటి సమాజంలో కరాటేపై ఆసక్తి తగ్గిందన్నారు. చిన్ననాటి నుంచే కరాటే, కరళియపట్టు లాంటి యుద్ధ విద్యలు నేర్చుకోవడం వల్ల విద్యార్థినుల్లో ఆత్మైస్థెర్యం పెరుగుతుందని పేర్కొన్నారు. కంప్యూటర్‌ కాలంలో విద్యార్థులకు కరాటే నేర్పిస్తున్న నిర్వాహకులను అభినందించారు. రాష్ట్ర ప్రభు త్వం మహిళల కోసం ప్రత్యేకంగా కరళియపట్టు నేర్పించాలనే సంకల్పంతో ముందడుగు వేస్తున్నదని గుర్తు చేశారు. పెద్దపల్లి జోన్‌ డీసీపీ రవీందర్‌ యాదవ్‌ మాట్లాడుతూ నేర ప్రవృత్తి పెరుగుతున్న తరుణంలో విద్యార్థి దశ నుంచే కరాటేను నేర్పించడం వల్ల శారీరక పరిపుష్టితో పాటు రక్షణ కోసం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ పోటీలకు కరీంనగర్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, జగిత్యాల, వరంగల్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చ ల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి దాదాపు 800 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యాసంస్థల కరస్పాండెంట్‌ అల్లెంకి శ్రీనివాస్‌, డ్రాగెన్‌ ఫీస్ట్‌ షాటోకాన్‌ కరాటే అకాడమీ ఇండియా చీఫ్‌ ఆర్గనైజర్‌ లక్ష్మీనర్సయ్య, సీనియర్‌ కరాటే మాస్టర్లు సంపత్‌కుమార్‌, వసంత్‌కుమార్‌, సీనియర్‌ కరాటే కోచ్‌లు కంటె సత్యశంకర్‌, కొయ్యడ మొండయ్య, రవీందర్‌కుమార్‌, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...