మన పథకాలు దేశానికే ఆదర్శం


Sat,December 7, 2019 01:28 AM

-గ్రామాల్లో నిరంతరం పారిశుధ్య చర్యలు
-రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
-ధర్మపురిలో 320మందికి రూ.11.55కోట్ల విలువగల పాడి గేదెల మంజూరు పత్రాల పంపిణీ
-3షగామాలకు ట్రాక్టర్ల అందజేత
-జిల్లా కేంద్రంలో అంబేద్కర్‌కు ఘన నివాళి
-పాల్గొన్న జడ్పీ అధ్యక్షురాలు వసంత, ఎమ్మెల్యే సంజయ్, కలెక్టర్ శరత్

జగిత్యాల, నమస్తేతెలంగాణ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ధర్మపురిలో ‘షెడ్యూల్డ్ కులాల కార్యాచరణ ప్ర ణాళిక 201-19’ గాను పైలెట్ ప్రాజెక్టు కింద నియోజకవర్గంలోని 320 మంది లబ్ధిదారులకు రూ.11కోట్ల 55లక్షల విలువగల గేదెల మంజూ రు పత్రాలను శుక్రవారం పంపిణీ చేశారు. 35 పంచాయతీలకు ట్రాక్టర్లను అందజేశారు. ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ పాడిరైతులకు ప్ర భుత్వం దన్నుగా నిలిస్తున్నదనీ, వ్యవసాయ రం గానికి అనుబంధంగా ఉన్న పాడిపరిక్షిశమను ప్రో త్సహించడంతో రైతులకు అదనపు ఆదాయం సమకూర్చేందుకు మేలు జాతి గేదెలను సబ్సిడీపై పంపిణీ చేస్తున్నదన్నారు.

కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి పాల దిగుమతి నిలిపివేసి మన రాష్ట్రంలోనే ఉత్పత్తి పెంచేలా చర్యలు తీసుకుంటున్నదన్నారు. కొద్దిపాటి పొలం ఉన్న రైతులకు రూ.4లక్షల విలువగల బర్రెలను సబ్బిడీపై అందజేస్తున్నట్లు తెలిపా రు. 60శాతం సబ్సిడీ, 40 శాతం బ్యాంక్ రుణం అందజేస్తున్నట్లు తెలిపారు. పాలసేకరణ మరింత పెంచేలా కరీంనగర్ డెయిరీ చర్యలు తీసుకుంటోందన్నారు. 20గుంటల భూమి కలిగిన రైతులు కూ రగాయల సాగుచేసేందుకు ప్రభుత్వం సబ్సిడీపై రూ.3.50లక్షల రుణాన్ని అందజేస్తున్నదనీ, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. అనంతరం 35 పంచాయతీలకు ట్రాక్టర్లను అప్పగించారు. గ్రామాల్లో నిరంతరం పారిశుధ్య చర్యలు చేప కు ప్రభుత్వం ప్రతి పం చాయతీకి ట్రాక్టర్ మంజూరు చేసిందన్నారు. 30 రోజుల కార్యాచరణ ద్వారా గ్రామాల రూపురేఖ లు మారాయన్నారు. జిల్లాలో 30 పంచాయతీలుండగా దాదాపు 300 పంచాయతీలకు ట్రాక్టర్ల కొనుగోలు పూర్తయిందనీ, 50 శాతం జీపీ నిధు లు, 50శాతం బ్యాంకురుణాలతో కొనుగోలు చేసి అప్పగిస్తున్నట్లు తెలిపారు.

ధర్మపురి పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
ధర్మపురి పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మం త్రి ఈశ్వర్ తెలిపారు. పట్టణంలో రూ.కోటితో నిర్మిస్తున్న వైకుం పనులను పరిశీలించి పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. రూ.1.30కోట్లతో సుందరీకరణ పను లు పూర్తి చేసిన చింతామణి చెరువును పరిశీలించారు. చెరువు మధ్యలో వరాహ నరసింహస్వామి విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తమ్మళ్లకుంటను కూడా రూ.65లక్షలతో సుందరీకరించనున్నట్లు తెలిపారు. రూ. 100కోట్లతో ధర్మపురి టెంపుల్ సిటీ అభివృద్ధి, రూ.25 కోట్ల మున్సిపల్ నిధులతో జరి గే అభివృద్ధి పనులతో ధర్మపురి రూపురేఖలు మారుతాయన్నా రు. ఇదివరకే రూ.9కోట్లతో పట్టణంలో అంతర్గత ర హదారులు, మురుగుకాలువల నిర్మాణపనులు నడుస్తున్నాయన్నారు.

బ్రా హ్మణ సంఘ భవనంలో శేషప్ప సాహితీ ఉత్సవాన్ని నిర్వహించగా మంత్రి పాల్గొని మాట్లాడుతూ పట్టణంలోన 45 ఏళ్లుగా సాహితీ మండలి అందిస్తున్న సేవలు అమోఘమని కొనియాడారు. శేషప్ప జీవిత విశేషాల గురించి ప్రముఖ సాహితీవేత్త సంగనభట్ల నరసయ్య ప్రసంగించారు. అనంతరం మండల స్థాయి పాఠశాల విద్యార్థులకు నృసింహ శతక పద్య పఠన పోటీలను నిర్వహించగా, పద్యపోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థుకు మంత్రి ఈశ్వర్ ప్రశంసా పత్రాలు అందజేశారు. శేషప్ప సాహితీ మిత్ర మండలి అధ్యక్షుడు డాక్డర్ రాజిడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్షికమంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్, జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్‌రావు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...