10శాతం వృద్ధి రేటుతో ముందుకు


Sat,December 7, 2019 01:16 AM

-త్వరలోనే జీడీకే-5 ఓసీపీ పనులు
-డివిజన్‌లో అందరిని కలుపుకుని
-ఆర్జీ-1 జీఎం కల్వల నారాయణ

గోదావరిఖని, నమస్తే తెలంగాణ : సింగరేణి ప్రతి ఏటా 10 శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగుతున్నదనీ, ఇటీవల కొత్తగా ఆర్జీ-1 జీఎంగా బాధ్యతలు చేపట్టిన కల్వల నారాయణ పేర్కొన్నారు. ఆర్జీ-1 జీఎం కార్యాలయం కాన్ఫన్స్ హాలులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తిని పెంచుకుంటూ ముందుకు సాగుతున్నదనీ, మంచి వృద్ధి రేటుతో ముందుకు సాగుతున్న సంస్థ రానున్న రోజుల్లో మరింత ప్రగతిని సాధించే అవకాశాలున్నాయన్నారు. జీడీకే-5 గని స్థానంలో ఏర్పాటు చేసే జీడీకే-5 ఓసీపీ గనికి సంబంధించి పనులు త్వరలోనే ప్రారంభించే అవకాశముందన్నారు.

ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు నుంచి భారీ బొగ్గు నిల్వలు వెలికితీయడానికి ప్రణాళికలున్నాయని, ముందుగా బొగ్గుపై కప్పబడి ఉన్న 919లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్‌బ్డన్ (మట్టి)ని వెలికితీయాల్సి ఉందన్నారు. ఓసీపీ కింద ఉన్న జీడీకే-5 గని గతంలో మూసివేసిన జీడీకే-5ఏ గని ఉందన్నారు. ఈ గనిలో బొగ్గు ఓబీ రేషియో 7 క్యూబిక్ మీటర్లుగా ఉన్నదన్నారు.

ఈ ఓసీపీలో బొగ్గు ఉత్పత్తికి గాను ప్రజాభివూపాయ సేకరణ జరుగాల్సి ఉందన్నారు. పర్యావరణ అనుమతులు లభించిన వెంటనే ప్రజాభివూపాయ సేకరణ ఉంటుందన్నారు. ఆర్జీ-1 డివిజన్‌లోని అండర్‌క్షిగౌండ్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి పెంచడానికి కృషి చేస్తామన్నారు. ఆర్జీ-1 డివిజన్ జనరల్ మేనేజర్‌గా తాను బాధ్యతలు చేపట్టిన క్రమంలో అందరిని కలుపుకుని ముందుకెళ్తానన్నారు. పెద్ద డివిజన్‌గా ఉన్న ఇక్కడ కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి పాటుపడాల్సి ఉందన్నారు. ప్రతి రోజు 11వేల నుంచి 12 వేల బొగ్గును రవాణా చేయడానికి కృషి చేస్తానన్నారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఓటూ జీఎం త్యాగారాజు, అధికారులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...