దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై హర్షం


Sat,December 7, 2019 01:14 AM

పెద్దపల్లిటౌన్: దిశా హత్య కేసు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. పెద్దపల్లి పట్టణంలో గాయత్రి జూనియర్ కళాశాల విద్యార్థులు పోలీసులకు సంఘీభావంగా శుక్రవారం ర్యాలీ నిర్వహించి పోలీసులను అభినందించారు. కళాశాల నుంచి ప్రగతినగర్ మీదుగా పెద్ద మసీదు, జెండా చౌరస్తా, పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీ సాగింది. పెద్దపల్లి పోలీస్‌స్టేషన్ ఆవరణలో డీసీపీ, సీఐ, ఎస్‌ఐలకు పుష్పగుచ్ఛాలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, విధి నిర్వహణలో పోలీసులు ఎల్లప్పుడు ప్రజల రక్షణకు, ప్రజాక్షిశేయస్సు కోసమే పని చేస్తారని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు కళాశాల ముగిసిన తర్వాత ఆలస్యం జరిగితే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

విద్యార్థినులకు ఎలాంటి సమస్య ఎదురైనా షీ టీం, డయల్ 100కు, స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు వెంటనే అందుబాటులోకి వస్తారని అన్నారు. కార్యక్షికమంలో సీఐ ప్రదీప్‌కుమార్, ఎస్‌ఐ ఉపేందర్‌రావు, గాయత్రి కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌ను హర్షిస్తూ పెద్దపల్లి పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంథని నర్సింగ్ ఆధ్వర్యంలో ఏసీపీ హబీబ్‌ఖాన్, సీఐ ప్రదీప్‌కుమార్, ఎస్‌ఐ ఉపేందర్‌రావులకు పుష్పగుచ్ఛం అందించారు.

జూలపల్లి: దిశ కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై మండలకేంవూదంలోని పాత బస్టాండు ప్రాంతంలో బడుగుబలహీన వర్గాల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురికి స్వీట్లు పంచి పెట్టారు. ఇక్కడ ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, వైస్ ఎంపీపీ మొగురం రమేశ్, నాయకులు మానుమండ్ల శ్రీనివాస్, పాటకుల అనిల్, కొండ్ర సంతోశ్, పాటకుల నర్సయ్య, కూసుకుంట్ల రాంగోపాల్‌డ్డి, మామిడిపెల్లి కాంతయ్య, సీపెల్లి కొమురయ్య, నెరువట్ల ఆనంద్, సీపెల్లి అంజయ్య పాల్గొన్నారు.

ఎలిగేడు(జూలపల్లి): దిశ కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి హతమార్చి మహిళా లోకానికి న్యాయం చేశారని జడ్పీ వైస్ చైర్‌పర్సన్ మండిగ రేణుక పేర్కొన్నారు. ఎలిగేడు మండల కేంద్రంలో శుక్రవారం సర్పంచ్ భూర్ల సింధుజతో కలిసి పలువురికి స్వీట్లు పంచి పెట్టి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నిందితులను హతమార్చడంతో దిశ ఆత్మ శాంతించిందని ఉద్ఘాటించారు. చిన్నపిల్లలు, యువతులు, మహిళల రక్షణకు ప్రత్యేక చట్టాలు రూపొందించాలని కోరారు. యువతులు, మహిళలు ఆత్మరక్షణపై శ్రద్ధ తీసుకోవాలని సూచించా రు. మాజీ ఎంపీటీసీ భూర్ల సత్యనారాయణ, కరివేద సుధాకర్‌డ్డి, మహిళలు పాల్గొన్నారు.
ఓదెల: దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మండలకేంవూదంలో నాయకులు శుక్రవారం స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్షికమంలో నాయకులు ఆకుల మహేందర్, తీర్థాల కుమారస్వామి, సతీశ్, అనిల్, వెంకటస్వామి, మొగిలి, రాయమల్లు, స్వామి, నందయ్య తదితరులు ఉన్నారు.
కాల్వశ్రీరాంపూర్: దిశ నిందితులకు ఎన్‌కౌంటరే సరైన నిర్ణయమని మహిళా సంఘాల నాయకురాళ్లు జనగామ ప్రమీల, శోభ, రమాదేవిలు అన్నారు. నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.

సుల్తానాబాద్ రూరల్: సమాజంలో మార్పు రావాలని, అప్పుడే నేరాలు చేసేందుకు భయపడతారని నేహా స్కూల్ కరస్పాండెంట్ దేవేందర్‌డ్డి అన్నారు. రేపిస్టు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మండలంలోని నర్సయ్యపల్లి గ్రామ పరిధి నేహా కాన్సెప్ట్ స్కూల్ ఆవరణలో శుక్రవారం ఉపాధ్యాయులు, విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టి సంబురాలు జరుపుకున్నారు. నిందితులను ఎన్‌కౌంటర్ చేసింనదుకు సీఎం కేసీఆర్‌కు, పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంతో ఆమె తల్లిదంవూడులకు న్యాయం జరిగిందన్నారు. కార్యక్షికమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులున్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles