పేదింటి పెళ్లికి పెద్దన్నగా..


Thu,December 5, 2019 01:28 AM

-పెళ్లి పెద్దగా నిలిచిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌
-తాళిబొట్టు, పుస్తెలు అందజేత
-నీడ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కుదిర్చిన వివాహం

గోదావరిఖని, నమస్తే తెలంగాణ: నిరుపేద దివ్యాంగుల వివాహానికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అండగా నిలిచారు. వివరాలు ఇలా ఉన్నాయి. కాటారానికి చెందిన శంకర్‌కు పుట్టుకతోనే ఒక చేయి లేదు. గోలివాడ గ్రామానికి చెందిన మంజులకు రెండు కాళ్లు లేవు. వీరికి నీడ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు పలెర్ల రమేశ్‌గౌడ్‌, దయానంద్‌ గాంధీ వివాహం కుదిర్చారు. బుధవారం వీరి వివాహం గోదావరిఖనిలోని కోదండరామాలయంలో జరిగింది. ఈ పెండ్లికి ఎమ్మెల్యే చందర్‌ హాజరై తాళిబొట్టు, పుస్తె అందజేసి భోజన ఏర్పాట్లుచేశారు. స్థానికుడైన కోదాది రమేశ్‌-కవిత దంపతులు వివాహఖర్చును భరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చందర్‌ మాట్లాడుతూ నీడ ఫౌండేషన్‌ మున్ముందు మరిన్ని సేవాకార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పేదరికం శాపం కాకూడదని చేతనైనంత సహాయం చేశానని చెప్పారు. వివాహ వేడుకకు ఆర్థిక సహాయం అందజేసిన కోదాది రమేశ్‌-కవిత దంపతులను అభినందించారు. గోదావరిఖనిలో ఇకనుంచి నిరుపేద కుటుంబాల వివాహ వేడుకకు తమవంతుగా ఆర్థిక చేయూతనందిస్తామని, నీడ ఫౌండేషన్‌ ద్వారా తమవంతుగా ఐదువేల రూపాయల సహాయం చేస్తామని కోదాది రమేశ్‌-కవిత దంపతులు ఈ సందర్భంగా ప్రకటించారు.

ఈ వేడుకలో స్వచ్ఛంద సంఘాల సలహాదారు దయానంద్‌ గాంధీ, సంతోష రెడ్డి, సంధ్యారెడ్డి, పల్లెర్ల రమేశ్‌, అర్చకులు మధుసూదనచార్యులు, పెంట రాజేశ్‌, దాసరి శ్రీనివాస్‌, బిక్కినేని నర్సింగరావు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఉన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...