కోలిండియా స్థాయిలో సత్తాచాటాలి


Thu,December 5, 2019 01:21 AM

-ఆర్జీ-1 జీఎం కే.నారాయణ
-బాడీ బిల్డింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలు ప్రారంభం

గోదావరిఖని, నమస్తే తెలంగాణ : బాడీ బిల్డింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌లో కోలిండియా స్థాయిలో సత్తా చాటాలని ఆర్జీ-1 జీఎం ఆర్జీ-1 జీఎం కే.నారాయణ సూచించారు. ఆర్జీ-1 ఏరియా సీఈఆర్‌ క్లబ్‌లో బుధవారం నుంచి కంపెనీ స్థాయి బాడీ బిల్డింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఆర్జీ-1 జీఎం కే.నారాయణ హాజరై ముందుగా క్రీడా జెండాను ఆవిష్కరించారు. అనంతరం వివిధ ఏరియాల నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకొని రిబ్బన్‌ కత్తిరించి పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రీడలు ఉద్యోగుల మానసికోల్లాసానికి, శారీరక దారుఢ్యంకు దోహద పడుతాయన్నారు. గతేడాది కోలిండియాలో జరిగిన పోటీలలో 11 గోల్డ్‌ మెడల్‌, 7 సిల్వర్‌, 1 బ్రాంజ్‌ మెడల్‌ను సంపాదించామనీ, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సింగరేణి కీర్తి పతాకాన్ని కోలిండియాలో ఎగురవేయాలనీ, సింగరేణి క్రీడాకారులకు కావల్సిన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ఖర్చుకు వెనుకాడకుండా కృషి చేస్తుందన్నారు.

ఈ పోటీలలో మంచి ప్రతిభ కనబర్చి కోలిండియా స్థాయి పోటీలకు ఎంపిక కావాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఓటూ జీఎం త్యాగరాజు, సీఎంఓఏఐ అధ్యక్షుడు మనోహర్‌, పీఎం రమేశ్‌, జీఎం కమిటీ సభ్యుడు పుట్ట రమేశ్‌, క్రీడా సూపర్‌వైజర్‌ సుందర్‌ రాజు, రజాక్‌, రాజ్‌నారాయణ, కిరణ్‌కుమార్‌, సమ్మయ్య, షబ్బీర్‌ అహ్మద్‌, రాజయ్య, అన్ని ఏరియాల క్రీడాకారులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...