ఉత్పత్తి లక్ష్య సాధనకు అందరూ కృషి చేయాలి


Thu,December 5, 2019 01:20 AM

మందమర్రి రూరల్‌ : మందమర్రి ఏరియాకు నిర్ధేశించిన వార్షిక లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు అం దరూ కృషి చేయాలని అధికారులతో ఏరియా జీఎం రమేశ్‌రావు పేర్కొన్నారు. బుధవారం ఆయ న జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో ఏరియాలోని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రోజు వారీగా రక్షణతో కూడిన ఉత్పత్తి సాధనలో ఎలాంటి తేడాలు ఉండకుండా చూసుకోవాలన్నారు.

కార్మికులకు గైర్హాజరయితే వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించి పనులలోకి వచ్చే విధంగా గని అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్పత్తిలో కేకే, ఆర్‌కేపీ ఓసీపీలే ప్రధాన పాత్ర పోషించాలన్నారు. వర్షకాలంలో నష్టపోయిన ఉత్పత్తిని సాధించేందుకు అందరూ కృషి చేయాలని ఆదేశించారు. కార్మికులు, అధికారులు అనే తేడా లేకుండా ఐక్యతతో పని చేసినప్పుడే లక్ష్యాన్ని సాధించగలుతామని సూచించారు. ఈ సందర్భంగా ఆయన గనులు, ఓసీ అధికారుల ప్రగతి వివేధికను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...