ఇద్దరిపై క్రమశిక్షణ చర్యలు


Thu,December 5, 2019 01:20 AM

గోదావరిఖని, నమస్తే తెలంగాణ : సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘమైన టీబీజీకేఎస్‌లో క్రమశిక్షణను ఉల్లంఘించిన ఇద్దరిని యూనియన్‌ నుంచి బహిష్కరించినట్లు టీబీజీకేఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట్రావ్‌, మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. గత నెల 25న గోదావరిఖని ఆర్జీ-1 జీఎం కార్యాలయంలో టీబీజీకేఎస్‌ నాయకుల మధ్య జరిగిన గొడవకు సంబంధించి బేబి శ్రీను, పెంచాల తిరుపతిలను యూనియన్‌ నుంచి బహిష్కరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే, రామగుండం రీజియన్‌ సెక్రెటరీ కనకం శ్యాంసన్‌, ఆర్జీ-1 ఏరియా ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్‌కు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు.

గత నెల 29న శ్రీరాంపూర్‌లో జరిగిన టీబీజీకేఎస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో ఇక్కడ జరిగిన గొడవపై చర్చించి అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. టీబీజీకేఎస్‌ ఆర్జీ-1 ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న గండ్ర దామోదర రావు ఫిట్‌ సెక్రెటరీలను, కింది స్థాయి నాయకులను పట్టించుకోకుండా వ్యవహరించడం వల్లనే ఇబ్బందులు తలెత్తాయనీ, ఆయన తీరు వల్లనే గత నెల 25న గొడవ జరిగినట్లు భావించాల్సి వచ్చిందనీ, టీబీజీకేఎస్‌ సీనియర్‌ నేతగా ఉన్న కనకం శ్యాంసన్‌ ఈ అంశంలో ఉండడం ఆయనకు మొదటిసారిగా హెచ్చరిక జారీ చేయాలని నిర్ణయించి నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. టీబీజీకేఎస్‌ యూనియన్‌లో క్రమశిక్షణతోపాటు యూనియన్‌ బలోపేతానికి అందరూ సమష్టిగా కృషి చేయాలనీ, ఎవరు ఉల్లంఘించినా క్షమించేది లేదన్నారు.

ప్రస్తుతం యూనియన్‌లో బేబి శ్రీనివాస్‌, పెంచాల తిరుపతికు ఎలాంటి పదవులు లేవనీ, వారిని ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు. క్రమశిక్షణతో ఉండాల్సిన నాయకులు తప్పడం వల్ల వారిని మందలిస్తూ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఇకముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన అవసరం అందరిపై ఉన్నదనీ, ఇది కేవలం తాము తీసుకున్న నిర్ణయం కాదనీ, వర్కింగ్‌ కమిటీలోని అందరి అభిప్రాయాలు సేకరించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...