యువకులకు కౌన్సెలింగ్‌


Thu,December 5, 2019 01:19 AM

ధర్మారం: ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘ఆపరేషన్‌ చబుత్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్‌లో దిశపై యువ కులు అఘాయిత్యం చేసి దహనం చేసిన సంఘటన సంచలనం సృష్టించిన తరు ణంలో అల్లరి చిల్లరగా తిరిగే యువకులకు ‘ఆపరేషన్‌ చబుత్ర’కార్యక్రమాన్ని నిర్వహించాలని పోలీసు శాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ధర్మారం ఎస్‌ఐ కె. ప్రేమ్‌ కుమార్‌ బుధవారం రాత్రి కార్యక్రమాన్ని చేపట్టారు.

ఇష్టానుసారంగా క్షవరం పెంచుకుని బైక్‌లపై గ్రామాలలో ఆవారాగా తిరుగుతూ అమ్మాయిలనే టీజ్‌ చేస్తు న్నారని సమాచారంతో ధర్మారం, నంది మేడారం, కటికెనపల్లికి చెందిన యువకు లను పోలీసులు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకు వచ్చారు. ఎస్‌ఐ వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు ఇక ముందు నుంచి ఆవారాగా తిరిగే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అమ్మాయిలనే టీజ్‌ చేస్తే సహించమన్నారు. అనంతరం సదరు యువకుల వివరాలను చిరునామాను సేకరించారు. ఆవారా గ్యాంగ్‌లపై నిరంతర నిఘా ఉంచుతామని ఎస్‌ఐ ప్రకటించారు. ఈ సందర్భంగా వారి తండ్రులను పిలిచి యువకుల వైఖరిపై వివరించి మళ్లీ చెడు ప్రవర్థనతో కొనసాగితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...