ఎయిడ్స్‌ రహిత సమాజం నిర్మిద్దాం


Mon,December 2, 2019 12:45 AM

పెద్దపల్లిటౌన్‌: ఎయిడ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖా ధికారి ప్రమోద్‌కుమార్‌ పేర్కొన్నారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినం సందర్భంగా ఆదివారం ప్రభుత్వ ప్రధాన దవాఖాన నుంచి డీఎంహెచ్‌ఓ ఆకుపచ్చ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ పెద్దపల్లి పట్టణ వీధుల గుండా శాంతినగర్‌లోని ట్రినిటీ డిగ్రీ కళాశాల దాకా సాగింది. ఆ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి డీఎంఅండ్‌హెచ్‌ఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎయిడ్స్‌ వ్యాధి ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ దాని బారినపడి చనిపోయిన తర్వాత అందరికీ దాని తీవ్రత తెలుస్తుందన్నారు.

వ్యాధికి చికిత్స ఉందనే విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి మరింత తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని వివరించారు. వ్యాధి రాకుం డా ఉండాలంటే సాంఘిక కట్టుబాట్లు పాటిస్తూ వేశ్య గృహాలకు వెళ్లకుండా, విచ్చలవిడి శృంగారానికి దూరం గా ఉండాలని సూచించారు. విద్యార్థులు, యువత భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకుని వాటికి అనుగుణంగా ఉండాలని, చాటింగ్‌, డేటింగ్‌ల పేరుతో కాలయాపన చేయరాదని పేర్కొన్నారు. వ్యాధిగ్రస్తులు ఏఆర్‌టీ మందులు వాడితే రోగం అదుపులో ఉంటుందన్నారు. ప్రతి ఒక్క మహిళ, గర్భిణి సమయాల్లో హెచ్‌ఐవీ పరీక్షలు చేసుకుంటే వారికి పుట్టబోయే పిల్లలకు రాకుండా నివారించవచ్చని తెలిపారు. జిల్లాలో దాదాపుగా ఎయిడ్స్‌ వ్యాధి రోగులు తక్కువగా ఉన్నారన్నారు. వెయ్యి మంది గర్భిణులకు పరీక్షలు చేస్తే ఒక్కరికి మాత్రమే పాజిటివ్‌ నిర్ధారణ జరిగిందని చెప్పారు. పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని, గోదావరిఖని, ఎన్టీపీసీ దవాఖాన కేంద్రాల్లో ఎయిడ్స్‌, టీబీ సెంటర్లలో వైద్య పరీక్షలు నిర్ధారించుకోవాలని తెలిపా రు. వ్యాధి సోకిన వారికి ఉచితంగా ఏఆర్‌టీ మందులు పంపిణీ చేయడంతో పాటు డబుల్‌ రేషన్‌ అందజేస్తామన్నారు. దీంతో పాటు ఇప్పటికే జిల్లాలో 1,171 మందికి పింఛన్‌ ఇస్తున్నట్లు వివరించారు. విద్యార్థుల్లో అవగాహన కల్పించడం కోసం వ్యాసరచన పోటీలు నిర్వహించామని తెలిపారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో పెద్దపల్లి ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్‌ మం దల వాసుదేవరెడ్డి, ప్రోగ్రామ్‌ అధికారి డాక్టర్‌ కిశోర్‌కుమార్‌, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, విద్యార్థులు, వ్యాఖ్యాత లక్ష్మీనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...