పల్లకీలో ఊరేగిన మల్లన్న


Mon,December 2, 2019 12:45 AM

కమాన్‌పూర్‌: మండలంలోని జూలపల్లి గ్రామం లో ఆదివారం పర్వతాల మల్లికార్జునస్వామి పల్లకి సేవ కన్నులపండుగా జరిగింది. ఎలబోయిన వంశీయుల ఆధ్వర్యంలో గ్రామంలోని పురవీధుల గుండా పల్లకిలో మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిమను నిర్వహించారు. షష్టి వారాలు ప్రారంభంలో ప్రతి ఏడాది ఎలబోయిన వంశీయుల ఇంటి నుంచి మల్లిఖార్జున స్వామి విగ్రహ ప్రతిమను ప్రజల దర్శనం కోసం పల్లకిలో ఊరిగించి ఆలయం వద్దకు తీసుకెళ్లి పునఃప్రతిష్ఠించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. డోలు వాయిధ్యాలు, మహిళల కోలాట నృత్య ప్రదర్శనలతో భక్తజనుల సందోహం మధ్య అట్టహాసంగా కార్యక్రమం కొనసాగింది. స్వామివారికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలోని ప్రజలే కాకుండా మండలంలోని వివిధగ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి మల్లికార్జున సస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

దర్శించుకున్న జడ్పీ చైర్మన్‌
మల్లిఖార్జున స్వామి ఊరేగింపు ఉత్సవ వేడుకలకు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధు హాజరై స్వామి వారికి కొబ్బరికాయ కొట్టి దర్శించుకుని పల్లకిని మోశారు. అలాగే కమాన్‌పూర్‌ ఎంపీపీ రాచకొండ లక్ష్మి, సర్పంచ్‌ బొల్లపెల్లి శంకర్‌గౌడ్‌, ఎంపీటీసీ సభ్యులు శెవ్వ శంకరయ్య, అబ్బిడి వినోద, కమాన్‌పూర్‌ సర్పంచ్‌ నీలం సరిత, టీఆర్‌ఎస్‌ మండలశాఖ అధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి, నాయకులు ఇటవేన కొమురయ్య, రాచకొండ రవి, మారబోయిన ముత్యాలు, బంగారు గట్టయ్య, కాంగ్రెస్‌ నాయకులు చొప్పరి సదానందం, రంగు సత్యనారాయణ, వేముల పోశెట్టి, ముత్యం తిరుపతి, గడ్డం మధునయ్య, గోస్కుల జగన్‌యాదవ్‌, సాగర్ల మల్లేశ్‌, వేముల సత్యనారాయణ, బూస తిరుపతి, జంగిలి కుమార్‌, ఆలయ ట్రస్ట్‌ చైర్మన్‌ ఎలబోయిన తిరుపతి, ఒగ్గు పూజారులు రవి, కొమురయ్య, రామన్న, తిరుపతి, రాములు, మొగిలి, మల్లయ్య, బాలకుమార్‌, రాంమూర్తి, నాగయ్య, శ్రీశైలం, అల్లి శ్రీనివాస్‌లతో పాటు అధికసంఖ్యలో భక్తలు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...