ఓసీపీ-3లో పర్యటన..


Sat,November 30, 2019 02:23 AM

యైటింక్లయిన్‌కాలనీ : డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్ ఆర్జీ-2 ఏరియా ఓసీపీ-3 ప్రాజెక్టులో పర్యటించారు. ఇందులో భాగంగా ఓసీపీ- 3 ప్రాజెక్ట్ వ్యూపాయింట్ ద్వారా పరిశీలించారు. అనంతరం ప్రాజెక్ట్ కార్యాలయంలో మ్యాప్ పరిశీలించి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యంగా వార్షిక లక్ష్య సాధనలో ఓసీపీల పాత్ర ఘననీయమైనదనీ, దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు ప్రణాళికలతో ఉత్పత్తి సాధించాలని సూచించారు.

అంతేకాకుండా 2020-21 వార్షిక సంవత్సరానికి కేటాయించనున్న లక్ష్యాయాలపై అధికారులతో చర్చించి బొగ్గు నిక్షేపాలు, పని స్థలాల పెంపు తదితర అంశాలపై సూచనలు చేశారు. ఇటీవల ప్రమాదాలు జరుగుతున్న సందర్భంగా రక్షణపై మరింత పటిష్ట చర్యలు తీసుకుని ప్రమాదాలు జరుగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఆర్జీ-2 జీఎం కల్వల నారాయణ, ప్రాజెక్ట్ అధికారి బండి వెంకటయ్య, ఎస్‌ఓటూ జీఎం సందనాల సాంబయ్య, పీఈ దుర్గావూపసాద్, మేనేజర్ మాధవరావు, సర్వే అధికారి నర్సింగరావు, ఎస్‌ఎస్‌ఓ పీవీ రమణ తదితరులు ఉన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...