‘విస్తరణ’ వేగవంతం చేయండి


Sat,November 30, 2019 02:22 AM

రామగిరి : ఆర్జీ-3 డివిజన్ పరిధిలోని ఓసీపీ-2 విస్తరణ, అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్ట్ మూడో ప్యానల్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సంస్థ డైరెక్టర్(ఆపరేషన్స్) ఎస్.చంద్రశేఖర్ సూచించారు. ఈ మేరకు ఆర్జీ-3, ఏపీఏ ఏరియాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన ఆయన అనంతరం జీఎం కార్యాలయంలో ఆర్జీ-3 జీఎం సూర్యనారాయణ, ఏపీఏ జీఎం వీరాడ్డిలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఓసీపీ-2 విస్తరణ పనులు, ఎల్-6 కెనాల్ అభివృద్ధి పనులు ఎక్కడిదాకా వచ్చాయని ఆరా తీశారు. అలాగే, అడ్రియాల లాంగ్‌వాల్ గనిలో ప్రస్తుతం నడుస్తున్న మూడవ ప్యానల్ అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ గనిలో నడుస్తున్న రెండో ప్యానల్ పనులు పూర్తయ్యేసరికి మూడో ప్యానల్ పనులు కూడా పూర్తయ్యేలా చూడాలనీ, నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. రక్షణతో కూడిన ఉత్పత్తికే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో ఏరియా ఇంజినీర్ సూర్యకుమార్, ఏఎల్‌పీ పీఓ నాగేశ్వరరావు, మేనేజర్ అబ్ధుల్ ఖాదిర్ అధికారులు ఉన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...