బెల్టు దుకాణాల్లో మద్యం అమ్మవద్దు


Sat,November 30, 2019 02:22 AM

కాల్వశ్రీరాంపూర్ : మండలంలోని పందిల్ల గ్రామంలో బెల్టు దుకాణాల్లో మద్యం అమ్మకాలు నిలిపివేయాలని కోరుతూ పంచాయతీ పాలకవర్గం ఆయా దుకాణాల నిర్వాహకులకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. గ్రామంలో మద్యం అమ్మకాలు పూర్తిగా నిలిపి వేయాలని పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసింది. తీర్మాణ కాపీ లను బెల్టు దుకాణాల నిర్వాకులకు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వారం రోజుల్లో మద్యం అమ్మకాలను గ్రామంలో పూర్తిగా నిలిపి వేయాలని సూచించారు.

లేదంటే పాలకవర్గం ఆధ్వర్యంలో తగు చర్యలు తీసుకొని జరిమానా విధిస్తామని హెచ్చరించారు. గ్రామంలో విచ్చలవిడి మద్యం అమ్మకాలతో పలువురు బానిసై, వారి కుటుంబాలు రో డ్డున పడిన సందర్భాలు ఉన్నాయని వివరించారు. గ్రామాభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. కార్యక్షికమంలో సర్పంచ్ దాసరి లావణ్య, ఎంపీటీసీ సభ్యుడు రావి సదానం దం, ఉప సర్పంచ్ ఇల్లందుల రమేశ్, పంచాయతీ కార్యదర్శి అమ్జద్‌పాషా, పట్వారీ అనిల్, వార్డు సభ్యులు పోతరవేన రాజయ్య, వనిత, శ్యామల, రజిత, స్వరూప, అంగన్‌వాడీ టీచర్ వసంత, ఆశా కార్యకర్త వాసవి, సీఏ స్వప్న తదితరులు ఉన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...