తాసిల్దార్‌కు ఘన సన్మానం


Thu,November 21, 2019 01:57 AM

కలెక్టరేట్‌: పెద్దపల్లి మండల తాసిల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన దుర్శెట్టి శ్రీనివాస్‌ను రైతు సమన్వయ సమితి సభ్యులు బుధవారం సన్మానించారు. ఈ మేరకు తాసిల్‌ కార్యాలయంలో శ్రీనివాస్‌ను పెద్దపల్లి మండల రైతు సమన్వయ సమితి సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఇనుగాల తిరుపతిరెడ్డి, గండు రంగయ్య, లక్కాకుల లింగయ్య, పూదరి శేఖర్‌, తూముల సుధాకర్‌, కేశవేని రవి, గాదె కృష్ణ, పూదరి రాజ్‌కుమార్‌, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...