కలెక్టరేట్: పెద్దపల్లి మండలం దేవునిపల్లి జాతర హుండీలను బుధవారం లెక్కించారు. దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు మధ్య హుండీలను జాతర నిర్వహణ కమిటీ సభ్యులు, గ్రామస్తుల సమక్షంలో లెక్కించారు. జాతరలోని అన్ని హుండీలను లెక్కించగా, జాతర ఆదాయం 4,00,385 రాగా, ఒక గ్రాము బంగారం, 500 గ్రాముల వెండి ఆభరణాలు, కోరమీసాలు, పట్టె నామాలు వచ్చాయి. లెక్కింపులో సర్పంచ్ రావిశెట్టి కిషన్, ఎంపీటీసీ పందిళ్ల లక్ష్మణ్, కార్యనిర్వాహణాధికారి శంకరయ్య, బొడ్డుపల్లి తిరుపతి, హరికృష్ణ తదితరులున్నారు.