రాజీ పడొద్దు.. నాణ్యత తప్పొద్దు


Sun,November 17, 2019 01:05 AM

-పట్టణాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది
-అందుకు అనుగుణంగా పనులు చేపట్టాలి
-నిధులను సక్రమంగా వినియోగించాలి
-ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
-జిల్లా కేంద్రంలో రోడ్ల నిర్మాణాల పరిశీలన
కలెక్టరేట్ : పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో టీయూఎఫ్‌ఐడీసీ నుంచి మంజూరైన రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆదేశించారు. పట్టణంలోని పలు వార్డుల్లో టీయూఎఫ్‌ఐడీసీ నిధుల ద్వారా చేపడుతున్న రోడ్ల నిర్మాణ పనులను సంబంధిత అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీలు, టీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే దాసరి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపాల్టీ పరిధిలోని కూనారం రోడ్, భూంనగర్, టీచర్స్ కాలనీ, సుభాష్‌నగర్, చీకురాయి రోడ్ తదితర కాలనీల్లో వేస్తు న్న రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, నాణ్యతా ప్రమాణాలపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో చేపడుతున్న రోడ్ల నిర్మాణంలో నాణ్యతపై ఎలాంటి రాజీలేకుండా పనులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

పట్టణాల అభివృద్ధి విషయంలో ప్రభు త్వం ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతున్నదని, అధికారులు కూడా అందుకు అనుగుణంగా ముందు చూపుతో ఆలోచించి పనులు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను సక్రమంగా వినియోగమయ్యేలా చూడాలన్నారు. పనులు పొందిన కాంట్రాక్టర్లు కూడా నిర్మాణ పనుల విషయంలో జాగ్రత్తగా వ్యహరించి, ప్రజల అవసరాలకనుగుణంగా పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ టీపీఓ శ్రీధర్‌ప్రసాద్, పంచాయతీరాజ్ ఏఈ సుదర్శన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు ఉప్పు రాజ్‌కుమార్, కృష్ణారెడ్డి, నర్సింహారెడ్డి, ఆనంద్, అన్వేశ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...