ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా


Sun,November 17, 2019 01:03 AM

జూలపల్లి : టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలకు ఏ ఆప ద వచ్చిన అండగా నిలిచి ఆదుకుంటానని గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రఘువీర్‌సింగ్ హామీ ఇచ్చారు. పెద్దాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ పల్లె అంజమ్మ భర్త మాజీ ఎంపీటీసీ సభ్యుడు రాములు అనారోగ్యంతో బాధపడుతుండగా, వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం మం జూరు చేసిన 2,50,000 ఎల్‌ఓసీ పత్రాన్ని శనివారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం నిస్వార్థంగా ఉద్యమించారనీ, పార్టీ అభ్యున్నతికి తోడ్పడుతు న్న కార్యకర్తలు, నాయకులకు ప్రభుత్వ పరంగా, నేనున్నా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. శాసన మండలి విప్ తానిపర్తి భానుప్రసాద్‌కు రాములు అనారోగ్య పరిస్థితి వివరించగా, ప్రత్యేక చొరవ తీసుకుని ఎల్‌ఓసీ మంజూరు చేయించారని వివరించారు. సీఎం కేసీఆర్, మంత్రులు రాజేందర్, ఈశ్వర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు కంకణాల జ్యోతి, లింగయ్య, గడ్డమీద శ్రీనివాస్, తొగరు శ్రీనివాస్, లోక రవీందర్‌రెడ్డి, కల్లెపెల్లి అంజయ్య, సూరిశెట్టి రాజేశం, కంకణాల వెంకటేశ్, తోట వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles