క్రీడలతో స్నేహ సంబంధాలు


Sun,November 17, 2019 01:02 AM

సుల్తానాబాద్ : క్రీడలతో ప్రాంతాలు, వ్యక్తుల మధ్య స్నేహ సంబంధాలు పెంపొం దుతాయని అల్పోర్స్ విద్యాసంస్థల అధినేత వి. నరేందర్‌రెడ్డి అన్నారు. పాఠశాలల క్రీడోత్సవాల్లో భాగంగా జగిత్యాలలో జరిగిన 65వ ఎస్జీఎఫ్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో సుల్తానాబాద్ పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవడంతో వారిని శనివారం ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడారు. విద్యార్థులను క్రీడారంగంలో ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిష్ణాతులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ ఇప్పిస్తున్నామని చెప్పారు. ఉమ్మడి జిల్లాస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన ఐదు గురు విద్యార్థులకు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు.

బాలికల విభాగంలో కె. హనీ, ఎ. రిషికరావు, జి. అక్షయ ఎంపిక కాగా, బాలుర విభాగంలో ఎన్. సాయిచరణ్‌రెడ్డి, ఏ. అజయ్ ఎంపికయ్యారని చెప్పారు. వారు సిద్దిపేట జిల్లాలోని కొండపాకలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారని తెలిపారు. విద్యార్థులను అభినందించిన వారిలో ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, వ్యాయామ ఉపాధ్యాయులున్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...