కలెక్టరేట్ : పెద్దపల్లి మండలం దేవునిపల్లిలో వెలసిన శ్రీలక్ష్మీనృసింహాస్వామి జాతర ఆదివారం అంగరంగవైభవంగా ప్రారంభం కానున్నది. ఐదో రోజున రథోత్సవంతో ఈ వేడుకలు ముగుస్తాయి. ఆలయ ప్రధాన అర్చకుడు కొం డపాక లక్ష్మీనృసింహాచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈఓ శంకరయ్య పర్యవేక్షణలో సర్పంచ్ రావిశెట్టి కిషన్ నేతృత్వంలో జాతర ఏర్పాట్లు చేశారు. జాతరను పురస్కరించుకొని శ్రీలక్ష్మీనృసింహాస్వామిని పెద్దపల్లి జడ్పీ సీఈఓ వినోద్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.