రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం


Sat,November 16, 2019 12:01 AM

-అన్నదాతలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నం
-మధ్య దళారీ వ్యవస్థను రూపుమాపుతం
-పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
-ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల ప్రారంభం

కలెక్టరేట్: అన్నదాతల సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్ర భుత్వం ప్రత్యేక శ్రద్ధతో ముందుకుసాగుతున్న నీ, దళారీ వ్యవస్థను రూపుమాపేందుకే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందనీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే దాసరి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్న ఉద్దేశంతో ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గతంలో కేవలం 40 నుంచి 50వరకు కొనుగోలు కేంద్రాలు మాత్ర మే ఉండేవనీ, రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. పెద్దపల్లి నియోజకవర్గంలో 125 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు దూరప్రాంతాలకు వెళ్లి ధాన్యాన్ని అమ్ముకునే కష్టాల నుంచి విముక్తి కల్పించామని ఉద్ఘాటించా రు.

కొనుగోలు కేంద్రాలను వినియోగించుకుని గ్రేడ్ ఏ రకానికి క్వింటాల్‌కు రూ.1835, సాధారణ రకానికి రూ.1815ల చొప్పున పొందాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలోపెట్టుకుని గ్రామ పంచాయతీ పాలకవర్గం రాత్రి పూట కూడా వెలుతురు ఉండాలన్న ఉద్దేశంతో నూతన కరెంట్ స్తంభాలను ఏర్పాటు చేసి విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడం అభినందనీయమన్నారు. అలాగే నూతనంగా ఏర్పాటు చేసిన శ్మశానవాటికలోనూ కరెంట్‌స్తంభాలు వేసి లైట్లను బిగించడం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, సర్పంచ్ అడప వెంకటేశం, ఎంపీటీసీ తోట శ్రీనివాస్, ఏపీ ఎం కొలుగూరి సంపత్‌కుమార్, మహిళా సంఘా ల సభ్యులు తిరుమల, రమ, సుజాత, జ్యోతి, గంగమ్మ, రమాదేవి, ఐకేపీ సీసీ హరి, నాయకులు మర్కు లక్ష్మణ్, గాండ్ల సతీశ్, ఎనుగుల మల్లయ్య, కుంట సదయ్య, కలవేన సతీశ్, గుండా కుమార్, వెలిచాల ఆంజనేయులు, కుమ్మరి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

పత్తికి మద్దతు ధర కోసం సీసీఐ కొనుగోలు కేంద్రాలు: ఎమ్మెల్యే దాసరి
పత్తికి మద్దతు ధర దక్కేందుకే ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. పెద్దపల్లి మండలంలోని నిమ్మనపల్లిలో గల మహాలక్ష్మి జిన్నింగ్ మిల్లులో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రైతులు అనేక కష్టాలకోర్చి పండించిన పత్తిని అమ్ముకునే సమయంలో దళారుల బారినపడి మోసపోకుండా ఉండేందుకే ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకుంటూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం 8 నుంచి 12శాతం తేమ ఉన్న పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.

కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5555కు పత్తిని అమ్ముకుని సొమ్ము చేసుకోవాలని పేర్కొన్నారు. ఎక్కడైనా రైతులను ఇబ్బందులకు గురి చేసినా, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర చెల్లించట్లేదని తెలిసినా తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి అనిల్‌బాబు, సీసీఐ అధికారి భరత్‌తోపాటు పలువురు జిన్నింగ్‌మిల్ నిర్వాహకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles