కనులపండువలా గోదావరి హారతి


Fri,November 15, 2019 11:59 PM

మంథనిరూరల్: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మంథని పట్టణ గోదావరి తీరంలో గోదావరి మహా హారతి శుక్రవారం కన్నులపండువగా సాగింది. ఈ సందర్భంగా గోదావరికి నక్షత్ర, కుంభ, కర్పూర హారతులిచ్చారు. అనంతరం చల్లగరిగే హనుమాన్ సేవా సమితి వ్యవస్థాపకుడు శ్రీ సాయిరెడ్డి స్వామిజీ మాట్లాడుతూ, కార్తీక మా సంలో దీపాలు వెలిగించడం ద్వారా సమాజంలో వ్యక్తుల్లో చీకటి తొలగిపోతుందని వివ రించారు. ప్రతియేటా కార్యక్రమాన్ని విజ యవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో గోదావరి మహాహారతి రాష్ట్ర కన్వీనర్ క్యాతం వెంకటరమణ, ఆర్గనైజర్లు లింగం శంకర్, బోయిని నారాయణ, బోగోజు శ్రీనివాస్, కొండపాక సత్యప్రకాశ్, చిలువేరి సతీశ్‌కుమార్, వేల్పుల రాజయ్య, నాంపల్లి రమేశ్‌తోపాటు పలువురు ఉన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...