ప్లాస్టిక్ సామగ్రి గోదాములపై దాడులు


Fri,November 15, 2019 11:59 PM

పెద్దపల్లిటౌన్: పెద్దపల్లి పట్టణంలోని చాకలివాడ పురుషోత్తం దవాఖాన సమీపంలోని దిలీప్ గోదాములపై మున్సిపల్ మేనేజర్ నయీమ్ షా ఖాద్రీ ఆధ్వర్యంలో తనిఖీలు చేసి, దాదాపు రూ.మూడు లక్షల విలువ చేసే ప్లాస్టిక్ గ్లాస్ ప్యాకెట్లు, కవర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడారు. స్వచ్ఛ పెద్దపల్లిగా మున్సిపల్ సిబ్బంది కృషి చేస్తున్నారని వివరించారు. కొందరు వ్యాపారులు ప్లాస్టిక్ వస్తువులు విక్రయించడం నేరమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా వ్యాపారులందరూ ప్లాస్టిక్ వస్తు వుల విక్రయాలు నిషేధించి, మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు. మేనేజర్ వెంట మున్సిపల్ అధికారులు, సిబ్బంది అవినాష్‌రెడ్డి, అభినవ్, శివకుమార్, పులపాక రాజు, మీర్‌బేగ్‌అలీ తదితరులున్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles