ఆటోడ్రైవర్ నిజాయితీ


Fri,November 15, 2019 11:59 PM

ఫెర్టిలైజర్‌సిటీ: తన ఆటోలో ప్రయాణికుడు మరిచిపోయిన ల్యాప్‌టాప్, బ్యాగ్‌ను ట్రాఫిక్ పోలీసుల ద్వారా బాధితుడికి అందించి నిజాయితీ చాటాడు గోదావరిఖనికి చెందిన రోడ్డ ప్రవీణ్ అనే ఆటో డ్రైవర్. పోలీసుల వివరాల ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన బూరుగుపల్లి కిరణ్‌కుమార్ కరీంనగర్‌కు వెళ్లేందుకు ద్వారకానగర్ నుంచి ఆటోలో గోదావరిఖని బస్టాండ్‌కు వచ్చి అదే వాహనంలో తన బ్యాగ్ మరిచిపోయాడు. అందులో ల్యాప్‌టాప్‌తోపాటు ఇతర డాక్యుమెంట్లు ఉండగా, గుర్తించిన ఆటో డ్రైవర్ ప్రవీణ్ రామగుండం ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సీఐ రమేశ్‌బాబుకు బ్యాగు అందజేశారు. దీంతో సీఐ బ్యాగులో బాధితుడి సెల్ నంబర్ తెలుసుకొని అతడిని గోదావరిఖనికి పిలిపించారు. ట్రాఫిక్ ఏసీపీ రాంరెడ్డి ద్వారా ఆటో డ్రైవర్ ప్రవీణ్‌తో బ్యాగ్‌ను బాధితుడికి అం దించారు. నిజాయితీ చాటిన ఆటో డ్రైవర్‌ను ట్రాఫిక్ ఏసీపీ హానెస్ట్ అవార్డు ధ్రువీకరణ పత్రాన్ని ఇచ్చారు. ఇక్కడ సీఐ రమేశ్‌బాబు, ఎస్‌ఐలు సూర్యనారాయణ, ఇసాక్ అహ్మద్ తదితరులున్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...