ఆహారపు అలవాట్లలో మార్పు రావాలి


Fri,November 15, 2019 02:50 AM

టింక్లయిన్‌కాలనీ : చక్కర, శుద్ధి చేసిన పిండి పదార్ధాలకు దూరంగా ఉండడంతోపాటు ఆహారపు అలవాట్లలో మార్పు వల్ల మధుమేహంకు దూరంగా ఉండవచ్చునని ఆర్జీ-2 జీఎం కల్వల నారాయణ పేర్కొన్నారు. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా గురువారం ఆర్జీ-2 సేవా సమితి ఆధ్వర్యంలో సెక్టార్-3 డిస్పెన్షరీలో కార్మికులకు, కార్మిక కుటుంబాలకు మధుమేహంపై అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జీఎం హాజరై జ్యోతిప్రజ్వలన చేసి మాట్లాడారు. మధుమేహం రాకుండా ప్రతి ఒక్కరూ క్రమం తప్పక వ్యాయమం, యోగా, ఆహారపు అలవాట్ల నియంత్రణ, మద్యపానం తదితర వాటిని ఆదుపులో ఉంచుకోవాలని సూచించారు. అనంతరం కార్మిక కుటుంబాలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటూ జీఎం సాంబయ్య, డివిజన్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్, అధికారుల సంఘ సభ్యుడు డీవైపీఎం చంద్రమౌళి, అధికార ప్రతినిధి ప్రదీప్ కుమార్, డీజీఎం(సి) రామకృష్ణ, ఎస్‌ఈ మురళీకృష్ణ, పీఎం రాజేంద్రప్రసాద్, పర్యావరణాధికారి రాజారెడ్డి, డాక్టర్ రమేశ్‌బాబు, డాక్టర్ పద్మ, డాక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్‌ఎస్‌ఓ పీవీ రమణ, సేవా సభ్యులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

జీవన విధానంలో మార్పుతో..
రామగిరి : భారతదేశంలో మానవుని జీవన విధానంలో మార్పు ద్వారానే మధుమేహం సమూలంగా నిర్మూలించవచ్చని ఆర్జీ-3 జీఎం సూర్యనారాయణ, ఏపీఏ జీఎం వీరారెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ మధుమేహ నివారణ దినోత్సవం పురస్కరించుకుని స్థానిక డిస్పెన్సరీలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మధుమేహ వ్యాధి నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమయానికి భోజనం, వ్యాయామం, సరైన మందులు వాడటం వల్ల డయాబెటిస్ లేకుండా ఆరోగ్యంగా జీవించవచ్చని తెలిపారు. మానసిక ఒత్తిళ్లు, స్థూలకాయం వల్ల కూడా డయాబెటిస్ వస్తుందన్నారు. స్థానిక సీఎన్‌సీ డిస్పెన్సరీ డాక్టర్ పూర్ణచంద్రరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎస్‌ఓటూ జీఎం సురేందర్, ఏరియా ఇంజినీర్ రామలింగం, డా.సుహాసిని, టీబీజీకేఎస్ నాయకులు నాగేశ్వ రరావు, సీఎంఓఏఐ ట్రెజరర్ సురేఖ, అధికారులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...