తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శం


Tue,November 12, 2019 04:29 AM

మంథని రూరల్: బడుగు, బలహీన వర్గాలకు కా ర్పొరేట్‌స్థాయి విద్యనందించాలనే లక్ష్యంతో కేసీఆ ర్ సర్కారు ఏర్పాటు చేసిన గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. సోమవారం మంథని మైనార్టీ మహిళల హాస్టల్‌లో మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి సందర్భంగా జా తీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించా రు. అదేవిధంగా వెంకటాపూర్ బీసీ బా లుర హా స్టల్‌లో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ము ఖ్య అతిథిగా పెద్దపల్లి పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ హజరై మాట్లాడారు. బడుగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గు రుకులాలను ప్రారంభించారని అన్నారు. చదువు మాత్రమే మనిషి జీవితాన్ని మార్చగలదనే నమ్మకంతో ఏర్పాటు చేసిన ఈ విద్యాసంస్ధల్లో నేడు మంచి ఫలితాలు వస్తున్నయన్నారు.

విద్యార్థులకు ఎక్కడా కూడ ఇబ్బందులు లేకుండా ప్రైవేటు పాఠశాలలు, హస్టళ్లకు దీటుగా గురుకులాలు నిర్మించారన్నారు. తల్లి దండ్రులు గుండెమీద చేయి వేసుకొని పిల్లల భవిష్యత్తుకు బెంగ లేకుండా ఉండే వి ధంగా మంచి నాణ్యమైన విద్య, అహారం అంది స్తున్నామని చెప్పారు. ఇప్పటికే గురుకులాల్లో సీటు కావాలంటే చాల కష్ట తరంగా మారిందన్నా రు. ఎంతో మంది విద్యార్థుల తల్లిదండ్రులు సీ టు కోసం తనను సంప్రదించారని గుర్తు చేశారు. ప్రభుత్వ హస్టళ్లలో రికమెండేషన్ల సీటు సా ధించుకునే స్థితికి విద్యార్థుల తల్లి దండ్రులు వచ్చారంటే గురుకులాల్లో ఎంత గొప్ప విద్యను అందిస్తున్నా రో అర్థం చేసుకోవచ్చన్నారు. మహనీయులను ఆ దర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు ఉద్భో దిం చారు. ఈ సందర్భంగా మైనార్టీ హస్టల్‌లో అబుల్ కలాం అజాద్ చిత్ర పటానికి పూలమాల వేసి ని వాళులర్పించారు. అదేవిధంగా మంథని మం డలస్థాయి ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశం లోనూ నివాళులర్పించారు.

వెంకటాపూర్‌లో పుస్తక ప్రదర్శన..
మండలంలోని వెంకటాపూర్‌లో జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ రకాల పుస్తకాలను జడ్పీ చైర్మన్ మధు పరిశీలించారు. పుస్తక పఠనంతో అపార విజ్ఞానం సమకూరు తుందన్నారు. ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా ఒక గంట గ్రంథాలయంలో గడపాలని కోరారు. ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థులతో కలసి భో జనం చేశారు. విద్యార్థులకు అందిస్తున్న వసతి పై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు విద్యార్థులకు గుడ్డు, వారానికి నాలుగు రోజులు చికెన్, మటన్‌తో పాటుగా పోషకాలు కలిగి ఉన్న పదార్థాలను విద్యార్థులకు అందిస్తున్నామన్నారు

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...