జ్యోతినగర్: పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలో ఎన్టీపీసీ వేదికగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో ఎన్టీపీసీ టీటీఎస్‌లోని జిల్లా పరిషత్ క్రీడా మైదానంలో నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్ 17 రాష్ట్ర స్థాయి విలువిద్య(అర్చరీ)పోటీలు సోమవారంతో ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన పోటీల్లో ఓరాల్‌గా బాలుర విభాగంలో రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానం, కరీంనగర్ జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచాయి. బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో కరీంనగర్ జి ల్లా, ద్వితీయ స్థానంలో రంగారెడ్డి జిల్లా నిలిచింది. పోటీలకు ఎనిమిది జిల్లాల నుంచి మొత్తం 125 మంది క్రీడాకారులు పాల్గొనగా బాలికల నుంచి 12మంది, బాలుర నుంచి 12మంది చొప్పున మొత్తం 24మంది క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అనంతరం జరిగిన ముగింపు కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రంగారావు, రామగుండం మండల విద్యాధికారి డానియెల్, ఎన్టీపీసీ సీఎస్ఆర్ ఎజీఎం రఫీక్ ఉల్ఇస్లాం విజేతలకు పతకాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి బాబు శ్రీనివాస్, రామగుండం జోన్ కార్యదర్శి కోమురోజు శ్రీనివాస్, కరీంనగర్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమురోజు క్రిష్ణ, పీఈటీలు పీ శ్రీనివాస్, కే సత్యనారాయణ, రాజయ్య, రాజ్‌కుమార్, సమ్మయ్య, సోమశేఖర్, శోభరాణి, కవిత, తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
మొత్తం మూడు రౌండ్లలో గెలుపోందిన విజేతలు రౌండ్ల వారిగా బాలికల విభాగం ఇండియన్ రౌండ్లో ఆర్ సుజాత (మహబూబ్‌నగర్), బీ మానస (రంగారెడ్డి), ఎన్ మమత ( కరీంనగర్), ఏ త్రిషిత (రంగారెడ్డి), బాలుర విభాగంలో వివి శివ సాయికుమార్(రంగారెడ్డి), వీ జైతర్(ఆదిలాబాద్), కే సర్వేష్(హైదరాబాద్), డీ సంతోష్( భీమారం), రిజర్వు రౌండ్లో బాలుర నుంచి కబీనాగ్(రంగారెడ్డి), డీ ప్రవీణ్‌కుమార్(రంగారెడ్డి), కే శంకర్ ప్రతాప్(రంగారెడ్డి), ఎస్ నవీన్(నిజమాబాద్), బాలికల నుంచి కే సింధూజ (నిజామబాద్), పీ ఐశ్వర్య (నిజామబాద్), డీ వి న్నూత (రంగారెడ్డి), డీ హర్షిత (వరంగల్), కపౌండ్ రౌండ్లో బాలుర నుంచి వీ శివ సాయి(రంగారెడ్డి), హరిష్ (హైదరాబాద్), ఆర్ దీరాజ్రావు(కరీంనగర్), సిరిగిరి ప్రధాన్(హైదరాబాద్), బాలికల నుంచి టీ చిఖిత(కరీంనగర్), ఎ రిషిత (కరీంనగర్), టీ సంజన దాత్రి (వరంగల్), కేకవిత (మహబూబ్‌నగర్) ఉన్నారు. విజేతలు ఈ నెల 24 నుంచి 29వరకుకడపలో జరుగు జా తీయస్థాయి పోటీల్లో పాల్గొంటారు.