సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ టాప్


Mon,November 11, 2019 02:34 AM

-ప్రతి గడపకూ పథకాలు చేరాలి
-ఇందుకోసం పార్టీ కార్యవర్గ సభ్యులు బాధ్యతగా మెదలాలి
-ప్రాజెక్టుల నిర్మాణం, 24గంటల కరెంటుతో లాభసాటిగా వ్యవసాయం
-రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
-ధర్మపురిలో రెండు మండలాల పార్టీ కార్యవర్గసభ్యులతో సమావేశం
-పట్టణంలో మెగా డ్రైనేజీ, శ్మశానవాటిక పనుల పరిశీలన
-పెగడపల్లి మండలంలోని రెండు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

ధర్మపురి, నమస్తే తెలంగాణ/ పెగడపల్లి : సీఎం కేసీఆర్ పాలనలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శవంతంగా నిలిచిందని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం ధర్మపురి పట్టణంలోని బ్రాహ్మణ సంఘ భవనం లో బుగ్గారం, గొల్లపల్లి మండలాల టీఆర్‌ఎస్ పా ర్టీ అన్ని విభాగాల మండల, గ్రామశాఖ కార్యవర్గ బాధ్యులతో సమావేశం నిర్వహించారు. కార్యవర్గ బాధ్యులకు గ్రామాల్లో ప్రజలతో మమేకయ్యే విధానం, పథకాలు ప్రజలకు చేరవేసే విధానం తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మండల, గ్రామశా ఖ సభ్యులు గ్రామాల్లో తండ్రి పాత్ర పోషించాలని సూచించారు. సమస్యలున్న ప్రతి ఇంటికీ వెళ్లి వారికి అండగా నిలవాలన్నారు. గ్రామంలో నిస్వార్థంగా సేవ చేసే ప్రతి కార్యకర్తకూ మంచి భవిష్య త్తు ఉంటుందన్నారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులను గౌరవించుకుంటూ ముందుకు సాగాలన్నా రు. ప్రధానంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై పూర్తిస్థాయి అవగాహన ఉండాలన్నారు. గ్రామాల్లో, మండలాల్లో తలకుమాసిన ఇతర పార్టీల నాయకులు నోటికివచ్చింది మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఆబాసు పాలుచేయాలనే కుట్రలు ప న్నుతున్నారనీ, వారికి తగిన విధంగా సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. అర్థంలేని విమర్శలు చేసేవారికి సమాధానం చెప్పాలంటే అవగాహన తప్పనిసరన్నారు.

తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. విడిపోతే చెడిపోతారు అని ఆనాడు ఎద్దేవా చేసినవారే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ది, సాధించిన ప్రగతిని చూసి నివ్వెరపోతున్నారన్నారు. ముఖ్యం గా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు ప్ర పంచదేశాలకే రోల్‌మోడల్‌గా నిలిచాయన్నారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్‌ను అందిస్తూ అప్ప టి విమర్శలకు తగిన గుణపాఠం చెప్పామన్నారు. పేదింటి ఆడపిల్లల పెళ్లి భారంగా మారుతున్న పరిస్థితిలో వారికి రూ.51వేల నుంచి రూ.1,00,116కు కల్యాణలక్ష్మి నగదు సాయాన్ని ప్రభుత్వం పెంచిందన్నారు. అంతకుముందు ఎస్సీ, ఎస్టీ మైనార్టిలకు మాత్రమే వర్తింపజేసిన ఈ పథకాన్ని ఆర్థికంగా వెనకబడిన బీసీ, ఈబీసీ వర్గాలకు సైతం వర్తింపజేసినట్లు తెలిపారు. వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఎరువులు, ఇతర పెట్టుబడుల కోసం ఎకరానికి రూ.10వేలు అందజేస్తున్నట్లు వివరించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రత్యేక ప్రణాళిక లు రూపొందించినట్లు తెలిపారు. గొల్లకురుమల కు ప్రతి కుటుంబానికి గొర్రెల యూనిట్ ఇచ్చామన్నారు. మత్స్యకార్మికుల సంక్షేమం కోసం చెరువు ల్లో, రిజర్వాయర్లలో చేపల పెంపకం చేపట్టామన్నారు.

గత ప్రభుత్వాల పాలనలో అభివృద్ధితోపా టు ఆయా రంగాల్లో నిర్లక్ష్యానికి గురైన మైనారిటీలకు తెలంగాణ సర్కారు పెద్దపీట వేసిందన్నారు. మైనార్టీల్లో నిరక్షరాస్యత ఎక్కువ ఉందని గుర్తించి వారిలో అక్ష్యరాస్యత శాతాన్ని పెంచేందుకు సీఎం కేసీఆర్ ఆ వర్గాల పిల్లలకు చదువు కోసం 200కుపైగా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పా టు చేశారన్నారు. ప్రభుత్వ దావాఖానాల్లో కాన్పు అయిన పేద మహిళలందరికీ రూ.12వేల ఆర్థిక సాయం, ఆడపిల్ల పుడితే అదనంగా మరో వెయ్యి అందిస్తున్నట్లు తెలిపారు. తల్లీబిడ్డల ఆరోగ్యం కో సం కేసీఆర్ కిట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్ర భుత్వ సంక్షేమ హాస్టళ్లలో సన్న బియ్యంతో మెరుగైన భోజనాన్ని అందిస్తున్నామన్నారు. మహిళల భద్రత కోసం మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిన షీటీ మ్స్ నేడు దేశానికే ఆదర్శంగా నిలిచాయనీ, దేశం లో ఎక్కడాలేని విధంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల ను నిర్మిస్తున్నామన్నారు. నిస్సహాయులకు ఆసరా పింఛన్లు రెట్టింపు చేసి అందిస్తున్నామన్నారు.

మెగా డ్రైనేజీ, శ్మశానవాటిక పనుల పరిశీలన..
ధర్మపురి గోదావరిలో మురుగునీరు కలువకుం గా రూ.3.80కోట్లతో పట్టణంలో నిర్మిస్తున్న మెగా మురుగు కాలువ పనులను మంత్రి పరిశీలించా రు. త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రూ.1.50కోట్లతో నిర్మిస్తు న్న శ్మశానవాటిక పనులనూ పరిశీలించారు. గోదావరి ఒడ్డున హనుమాన్ మందిరం పాతఘాట్ వ ద్ద ఏపుగా పెరిగిన తుమ్మలు తొలగించి హరితహా రం మొక్కలు నాటించాలని నాయకులకు ఆదేశించారు. ధర్మపురిలో అభివృద్ధి కండ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా కొన్ని పార్టీల నాయకులు అర్థంలేని మా టలు మాట్లాడుతున్నారనీ, అది వారి విజ్ఙతకే వదిలేస్తున్నామనీ, ప్రజలు కూడా ప్రతిదీ గమనిస్తున్నారన్నారు. ఆయనవెంట ఎంపీపీలు బాదినేని రాజమణి, ఎడ్ల చిట్టిబాబు, జడ్పీటీసీలు బాదినేని రాజేందర్, బత్తిని అరుణ, ఏఎంసీ చైర్మన్ అయ్యో రి రాజేశ్‌కుమార్, దేవస్థానం మాజీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు సంగిశేఖర్, సౌళ్ల నరేశ్, స్తం బంకాడి రమేశ్, మురికి శ్రీనివాస్, స్తంభంకాడి మహేశ్, అయ్యోరి వేణు, చీర్నేని మల్లేశం, మసర్తి పూర్ణచందర్, జగన్, బొల్లపు రమేశ్, మారంపల్లి బాబు, కిషన్, గంగాధర్ తదితరులున్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
పెగడపల్లి మండలం మ్యాకవెంకయ్యపల్లి, నా మాపూర్‌లో నందగిరి సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ఈశ్వర్ ప్రాంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల సంక్షేమం కో సం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను అమ లు చేశారనీ, ముఖ్యంగా 24 గంటల విద్యుత్, ప్రాజెక్టుల నిర్మాణంతో వ్యవసాయం లాభ సాటి గా మారిందన్నారు. భూ సమస్యల పరిష్కారం కో సం రికార్డుల ప్రక్షాళనతో పాటు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో అన్నదాతల ఆత్మహత్యలు తగ్గిపోయాయని వివరించారు. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడంతో పాటు, వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పింస్తున్నామన్నారు. దళారుల బెడద లేకుండా, గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం అహర్నిశలూ కృషి చేస్తున్న మ్యాకవెంకయ్యపల్లి సర్పంచ్ దంపతులు ఇనుకొండ లక్ష్మి-మోహన్‌రెడ్డిని మంత్రి సన్మానించా రు.

కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులు, పెగడపల్లి సహకార సంఘం చైర్మన్ ఓరుగంటి రమణారావు, జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్‌రావు, నందగిరి విండో చైర్మన్ ఉప్పుగండ్ల నరేందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ గాజుల గంగాధర్, సర్పంచులు ఇనుకొండ లక్ష్మి, ఇనుగాండ్ల కరుణాకర్‌రెడ్డి, రాజేశ్వర్‌రావు, ఉప్పలంచ లక్ష్మణ్, గాజుల రాకేశ్, నేరువట్ల బాబుస్వామి, ఉప సర్పం చ్ పెద్ది సంతోశ్, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు ఇనుకొండ మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షుడు లోక మల్లారెడ్డి, యూత్ అధ్యక్షుడు రాజు ఆంజనేయులు, నాయకులు గో లి సురేందర్‌రెడ్డి, తోట మోహన్‌రెడ్డి, సాగి శ్రీనివాసరావు, బండి వెంకన్న, తిర్మణి నర్సింహారెడ్డి, ఇ రుగురాల ఆనందం, గండ్ర ప్రవీణ్‌రావు, మడిగెల తిరుపతి, తోడేటి లోకేశ్, బాల్సాని శ్రీను, లైశెట్టి దామోదర్, భోగ లక్ష్మీనారాయణ, మహేశ్, చిరంజీవి, భూమానాయక్, పన్నాటి గంగాధర్, కాశెట్టి వీరేశం, సత్యనారాయణరెడ్డి, కారోబార్ అనంతరెడ్డి, విండో సీఈఓ సంకిటి రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...