ప్రతి గింజనూ కొంటాం..


Mon,November 11, 2019 02:32 AM

సుల్తానాబాద్‌రూరల్: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. సుద్దాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రేగడిమద్దికుంట గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు, సర్పంచులు అన్నెడి రవీందర్‌రెడ్డి, గడ్డం వసంత, ఎంపీటీసీ సభ్యురాలు గడ్డం రాజమణి, సింగిల్ విండో చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి, ఉప సర్పంచ్ వెంకటేశం, నాయకులు గట్టు శ్రీనివాస్‌గౌడ్, పుట్ట సదయ్య, మహిపాల్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, బోయిని శ్రీనివాస్, రాజిరెడ్డి, స్వామిగౌడ్, సయ్యద్ మీర్, జాని, మల్లేశం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
జూలపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. ఎలిగేడు సిం గిల్ విండో ఆధ్వర్యంలో తేలుకుంటలో ఆదివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రం, తేలుకుంట, చీమలపేట గ్రామాల్లో డీఎంఎఫ్‌టీ నిధులు ఖర్చు చేసి నిర్మించిన హైమాస్ట్ విద్యుత్ దీపాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గ్రామీణ ప్రాంతాల్లో డబుల్ రోడ్లు విస్తరించి తారు రహదారులుగా మార్చామని వివరించారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందన్నారు. రైతులు నేరుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర పొం దాలని సూచించారు.

అనంతరం పెద్దాపూర్ గ్రా మానికి చెందిన మాజీ ఎంపీపీ పల్లె అంజమ్మ భర్త, మాజీ ఎంపీటీసీ సభ్యుడు పల్లె రాములు అనారోగ్యంతో బాధపడుతుండగా, ఎమ్మెల్యే పరామర్శించారు. అలాగే తేలుకుంటలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో నెలకొన్న సమస్యలు తీర్చాలని కోరుతూ ప్రత్యేకాధికారి వరుణ్ జ్యోతి, విద్యార్థులు కలిసి ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఇక్కడ గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రఘువీర్‌సింగ్, ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, జడ్పీ సభ్యుడు బొద్దుల లక్ష్మణ్, సర్పంచులు సొల్లు పద్మ, తొంటి పద్మ, ఎంపీటీసీ సభ్యులు కత్తెర్ల శ్రీనివాస్, మొగురం రమేశ్, జూలపల్లి, ఎలిగేడు సింగిల్ విండో అధ్యక్షులు నల్ల మనోహర్డ్డ్రి, నరహరి సుధాకర్‌రెడ్డి, ఉప సర్పంచులు చొప్పరి నర్సింగం, అడువాల తిరుపతి, మాజీ సర్పంచులు గొడిశెల రవి, మెండె పోశాలు, సూరిశెట్టి రాజేశం, నాయకులు శాతళ్ల కాంతయ్య, కూసుకుంట్ల రాంగోపాల్‌రెడ్డి, పాటకుల అనిల్, సొల్లు శ్యామ్, చొప్పరి శేఖర్, చిగురు రవీందర్‌రెడ్డి, మడ్డి శ్రీనివాస్, చిప్ప శ్రీకాంత్ పాల్గొన్నారు.

మద్దతు ధర అందించేందుకే
కలెక్టరేట్: రైతులకు మద్దతు ధర అందించేందు కే ప్రభుత్వం ఐకేపీ, ప్రాథమిక సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఆదివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో కలిసి ధాన్యాన్ని తూకం వేసి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్‌రెడ్డి, జడ్పీ సభ్యుడు బండారి రా మ్మూర్తి, నాయకులు జడల సురేందర్, కొండి సతీశ్, అక్కపాక తిరుపతి, పూదరి మహేందర్, జావిద్, మార్కెటింగ్ అధికారులు ఉన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...