అపూర్వ సమ్మేళనం


Mon,November 11, 2019 02:31 AM

పెద్దపల్లి టౌన్ : పెద్దపల్లిలోని ట్రినిటీ పాఠశాలలో 2005-2006 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. జిల్లా కేంద్రంలోని శాంతి ఫంక్షన్‌లో ఆదివారం పూర్వ విద్యార్థులందరూ కలుసుకుని తమ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. గతంలో పాఠశాలలో చదువుకున్న విద్యార్థులంతా ఒక చోట కలుసుకోవడం సంతోషదాయకమన్నారు. పూర్వ విద్యార్థులంతా కలిసి సమాజం సేవలో పాలు పంచుకోవాలన్నారు. విద్యార్థులను ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని ముందుకెళ్లాలన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు, పాఠాలు చెప్పిన గురువులకు, విద్యాసంస్థలకు మంచి పేరు తీసురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరితో పూర్వ విద్యార్థులు కేక్ కట్ చేయించి, స్వీట్లు తినిపించుకున్నారు. పాఠశాలలో దశలో తాము చేసిన అల్లరి చేష్టలు, ఆట పాటలు, వేడుకలకు, విద్యాభ్యాసం గురించి పూర్వ విద్యార్థులు నెమరువేసుకున్నారు. కార్యక్రమంలో పాపిరెడ్డి, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...