అనారోగ్య మహిళకు మంత్రి అండ


Mon,November 11, 2019 02:31 AM

ధర్మారం : రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆపదలో ఉన్న వారికి ఆపద్భాందవుడిగా నిలుస్తున్నారు. తీవ్రమైన అనారోగ్య పరిస్థితిలో ఉన్న ఎంతో నిరుపేద బాధితులకు బాసటగా నిలిచి ఆదుకుంటున్నారు. ధర్మా రం మండలం పెర్కపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు శస్త్ర చికిత్స కోసం మంత్రి ఈశ్వర్ సాయం అందించి చికిత్సకు అండగా నిలిచారు. నెల్లి సరిత మహిళ అనారోగ్యానికి గురైంది. ఆమెకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో శస్త్ర చికిత్స అవసరం ఉండడంతో ఆర్థికంగా లేని ఆమె ప్రభుత్వం ద్వారా సాయం అందించాలని మంత్రికి విజ్ఞప్తి చేసింది. దీంతో ఆయన సిఫారసు మేరకు ప్రభుత్వం ద్వారా రూ. లక్ష లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఓసీ) ఇచ్చింది. ఆ పత్రాన్ని ఆ గ్రామ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు సత్తనవేని సదయ్య సమక్షంలో బాధితురాలు సరిత భర్త సతీశ్‌కు ఆదివారం మంత్రి కరీంనగర్‌లోని తన స్వగృహంలో అందజేశారు. దీంతో సరితకు శస్త్ర చికిత్స చేయించేందుకు మార్గం సుగమమైంది. తన భార్య శస్త్ర చికిత్స కోసం ద్వారా సాయం అందించిన మంత్రి ఈశ్వర్‌కు సరిత భర్త కృతజ్ఞతలు తెలిపారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...