వైభవంగా వేణుగోపాలస్వామి కల్యాణం


Mon,November 11, 2019 02:31 AM

ఎల్లారెడ్డిపేట: మండల కేంద్రంలో రుక్మిణీసత్యభామ సమేత వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఘనంగా జరిగింది. ఆదివారం వేణుగోపాల స్వామి ఆలయంలో స్వామివారికి హోమం, బలిహరణం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన అశ్వవాహనంపై రుక్మిణీసత్యభామసమేత ఉత్సవమూర్తులను పురవీధులగుండా ఊరేగించారు. భక్తు లు స్వామివారికి మంగళహారతులు పట్టారు. రథశాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉత్సవమూర్తులను ఉంచి కల్యాణ మహోత్సవా న్ని కన్నుల పండువలా నిర్వహించారు. అశ్విని హాస్పిటల్ వైద్యుడు జీ.సత్యనారాయణ స్వామి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో వేదపండితులు బీటుకూరి గోపాలచారి, నవీన్‌చారి రాచర్ల దయానంద శర్మ, టీఆర్‌ఎస్ జిల్లా అధికార ప్రతినిధి తోట ఆగయ్య, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు హాజరయ్యారు.

23
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...