లక్ష్యం దాటి పరుగులు


Sun,November 10, 2019 01:29 AM

-రీజియన్‌లో పెరిగిన బస్సులు
-అన్ని రూట్లలోనూ సేవలు
-శనివారం నడిచిన 676 సర్వీసులు-కరీంనగర్‌లో అత్యధికం
-సాఫీగా సాగిన ప్రజారవాణా

(కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ)కరీంనగర్ రీజియన్‌లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు బస్సులు నడిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. కరీంనగర్-1 డిపోలో 64 బస్సులకు 41 ఆర్టీసీ, 22 అద్దె బస్సుల చొప్పున 63 (98.44 శాతం) బస్సులు నడిపారు. కరీంనగర్-2 డిపో పరిధిలో 79 బస్సులకుగాను 57 ఆర్టీసీ, 29 అద్దె బస్సుల చొప్పున 86 (108.86 శాతం) నడిపారు. హుజూరాబాద్ డిపో పరిధిలో 63 బస్సులు నడపాల్సి ఉండగా 54 ఆర్టీసీ, 7 అ ద్దె బస్సుల చొప్పున 61 (96.83 శాతం) బస్సులు నడిపారు. జిల్లాలో మొత్తం 206 బస్సులకుగాను 152 ఆర్టీసీ, 58 అద్దె బస్సుల చొప్పున 210 (101.94 శాతం) నడిపారు. నడిచిన అన్ని బస్సుల్లో టిమ్స్ ద్వారా చార్జీలు వసూలు చేశారు.

-పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని డిపో పరిధిలో 86 బస్సులకుగాను 64 ఆర్టీసీ, 31 అద్దె బస్సుల చొప్పున 95 (110.47 శాతం) నడిపారు. -మంథని డిపో పరిధిలో 58 బస్సులకుగాను 49 ఆర్టీసీ, 10 అద్దె బస్సుల చొప్పున 59 (101.72 శాతం) నడిపారు. జిల్లాలో 144 బస్సులకుగాను 113 ఆర్టీసీ, 41 అద్దె బస్సుల చొప్పున 154 (106.94 శాతం) బస్సులు నడిపారు. 119 బస్సుల్లో టిమ్స్ ద్వారా, 35 బస్సుల్లో టికెట్ల ద్వారా చార్జీలు వసూలు చేశారు. -జగిత్యాల జిల్లాలోని జగిత్యాల డిపో పరిధిలో 106 బస్సులకుగాను 61 ఆర్టీసీ, 42 అద్దె బస్సుల చొప్పున 103 (97.17 శాతం) నడిపారు. కోరుట్ల డిపో పరిధిలో 46 బస్సులకు గానూ 37 ఆర్టీసీ, 12 అద్దె బస్సుల చొప్పున 49 (106.52 శాతం) నడిపారు. మెట్‌పల్లి డిపో పరిధిలో 46 బస్సులకుగాను 31 ఆర్టీసీ, 15 అద్దె బస్సుల చొప్పున 46 (100 శాతం) నడిపారు. జిల్లాలో 198 బస్సులకుగాను 129 ఆర్టీసీ, 69 అద్దె బస్సుల చొప్పున 198 (100 శాతం) నడిపారు. అన్ని బస్సుల్లో టిమ్స్ ద్వారా చార్జీలు వసూలు చేశారు.
-సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ డిపో పరిధిలో 44 బస్సులకుగాను 40 ఆర్టీసీ, 14 అద్దె బస్సుల చొప్పున 54 (122.73 శాతం) నడిపారు. సిరిసిల్ల డిపో పరిధిలో 59 బస్సులకుగాను 45 ఆర్టీసీ, 15 అద్దె బస్సుల చొప్పున 60 (101.69 శాతం) నడిపారు. జిల్లాలో 103 బస్సులకుగాను 85 ఆర్టీసీ, 29 అద్దె బస్సుల చొప్పున 114 (110.68 శాతం) బస్సులు నడిపారు. 109 బస్సుల్లో టిమ్ మిషన్ల ద్వారా, 5 బస్సుల్లో టికెట్ల ద్వారా చార్జీలు వసూలు చేశారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...