ఏఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్‌కు సన్మానం


Sun,November 10, 2019 01:27 AM

ధర్మారం : ధర్మారం మండలం పత్తిపాకలో, ధర్మారం వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద వేర్వేరుగా ఏఎంసీ చైర్మన్ గుర్రం మోహన్‌రెడ్డి, వైస్ చైర్మన్ గూడూరి లక్ష్మణ్ డైరెక్టర్లను పలువురు సన్మానించారు. పత్తిపాకలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా ర్పంచ్ బద్దం సుజాత-రవీందర్‌రెడ్డి దంపతులు, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు నోముల వెంకట్‌రెడ్డి సంయుక్తంగా మోహన్‌రెడ్డి, లక్ష్మణ్‌ను శాలువాలతో సన్మానించారు. అలాగే ధర్మారంలోని మార్కెట్ కార్యాలయం వద్ద కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు డైరెక్టర్లు ఎండీ హఫీజ్, బొంగాని తిరుపతిని నర్సింహుపల్లి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకులు సన్మానించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతి, విండో చైర్మన్ తాడ్వయి రాంగోపాల్‌రెడ్డి, డైరెక్టర్లు మెన్నేని వెంకటేశ్వర్‌రావు, బద్దం తిరుపతిరెడ్డి, నర్సింగాపూర్ సర్పంచ్ సురకంటి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు కోయెడ రవీందర్, బాలు నాయక్, అడువాల రవి, దీటి శ్రీనివాస్, ఆకుల స్వామి, గాండ్ల నర్సయ్య, ఎడ్ల మహేశ్, ఆవుల ఎల్లయ్య , కొమురిశెట్టి సతీశ్, లైశెట్టి సంతోష్, బత్తిని రవి, కత్తెర్ల లచ్చయ్య, పంబాల మధూకర్ ఉన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles