క్రీడాకారులకు సంపూర్ణ సహకారం


Sun,November 10, 2019 01:27 AM

జ్యోతినగర్ : రాష్ట్రంలోని క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తున్నదని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. ఎన్టీపీసీ టీటీఎస్ జిల్లా పరిషత్ పాఠశాల క్రీడా మైదానంలో ఎస్‌జీఎఫ్ రాష్ట్ర స్థాయి విలువిద్య పోటీలను వారు శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడాకారులకు ప్రాధాన్యతనిస్తూ, వారి కోసం సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. రామగుండం వేదికగా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్యాభ్యాసానికి టీఆర్‌ఎస్ సర్కార్ పెద్దపేట వేసిందనీ, గురుకులాల్లో నాణ్యమైన బోధనతోపాటు క్రీడలకు ప్రాధాన్యనిస్తున్నదని పేర్కొన్నారు. అండర్-17 బాల బాలికలకు మూడు రోజుల పాటు పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మొదటి రోజున 125మంది క్రీడాకారులు హాజరైనట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ సభ్యురాలు కందుల సంధ్యారాణి, రామగుండం ఎంఈఓ డేనియెల్, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి బాబు శ్రీనివాస్, రామగుండం జోన్ కార్యదర్శి కోమురోజు శ్రీనివాస్, పీ శ్రీనివాస్, కే సత్యనారాయణ, రవి, సోమశేఖర్, శోభారాణి ఉన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...