మున్సిపల్ అధికారుల స్పెషల్ డ్రైవ్


Sun,November 10, 2019 01:27 AM

పెద్దపల్లిటౌన్: స్వచ్ఛతా హీసేవా కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లిలో శనివారం మున్సిపల్ అధికారులు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి, ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. సుభాష్‌నగర్‌లోని ఇండియన్ గ్యాస్ కార్యాలయం కూడలిలో రోడ్డుపై ఇంటి యజమాని చెత్త వేసిన విషయాన్ని గమనించిన మున్సిపల్ అధికారులు వారితోనే చెత్తను తీయించి మున్సిపల్ రిక్షాలో వేయించారు. అలా గే అయ్యప్ప ఆలయం వద్ద మల్లమ్మ కూరగా యల మార్కెట్‌లో మున్సిపల్ అధికారులు తనిఖీలు చేయగా, ప్లాస్టిక్ కవర్లు లభించండంతో మార్కెట్ యజమానికి రూ. రెండు వేల జరిమానా, కూరగాయల మార్కెట్‌లో వ్యాపారికి రూ. 500 జరిమానా విధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నయీమ్‌షా ఖాద్రీ, ఎన్విరాల్‌మెంట్ ఇంజినీర్ అవినాష్‌రెడ్డి, సానిటరీ ఇన్‌స్పెక్టర్లు రాంమోహన్‌రెడ్డి, ఉనుకొండ మధు, పులిపాక రాజుతో పాటు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...