సన్న బియ్యం ఇచ్చి.. ప్లాస్టిక్ సేకరించి


Sun,November 10, 2019 01:26 AM

కలెక్టరేట్: స్వచ్ఛతలో భాగంగా ప్లాస్టిక్‌ను పూర్తి స్థాయిలో నిర్మూలించాలన్న ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆదేశాలను అందిపుచ్చుకున్న మూ లసాల సర్పంచ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ గ్రామంలో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణలో భాగంగా ఇంటిలో అవసరాలకు వాడుకుని అమ్మకానికి పోగుచేసుకున్న ప్లాస్టిక్ వస్తువులను శనివారం సర్పంచ్ ఎనగందుల శంకరయ్య తూ కం ప్రకారం సన్నబియ్యం ఇచ్చి కొనుగోలు చే శారు. గ్రామానికి చెందిన ఈర్ల పోశమ్మ దగ్గరి నుంచి ప్లాస్టిక్ వస్తువులను కొనుగోలు చేసి అందుకు రెండు కిలోల బియ్యాన్ని ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో ఎక్కడ కూడా ప్లాస్టిక్ వ్యర్థాలను ఆరుబయట పడేయద్దని, ఇంటిలోనే జమ చేసి గ్రామ పంచాయతీ సిబ్బందికి అప్పగిస్తే కొనుగోలు కింద బియ్యం ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ దాసరి శంకరయ్య, వార్డుసభ్యుడు సిరిపురం నర్సయ్య, పంచాయతీ కార్యదర్శి స్వప్న, కారోబార్ కొమురయ్య తదితరులున్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...