అమాత్యుడిని కలిసిన నేతన్న


Sat,November 9, 2019 04:53 AM

సిరిసిల్ల రూరల్ : సిరిసిల్ల మండలం చంద్రంపే ట పరిధిలోని జ్యోతినగర్‌కు చెందిన నేత కార్మికు డు కుసుమ నర్సింహస్వామి శుక్రవారం మంత్రి కేటీఆర్ కలిశారు. మరమగ్గాలపై ఎలక్ట్రానిక్ జకార్డ్‌పై పట్టు చీరల తయారీ చేస్తున్న విధానాన్ని నమస్తే తెలంగాణ మెయిన్ పేజీలో గత అక్టోబర్ 20న ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో సిరిసిల్ల పర్యటనకు విచ్చేసిన మంత్రి కేటీఆర్‌ను నేత కార్మికుడు కుసుమ నర్సింహస్వామి, అతడి కొడుకు అశోక్, మర్యాద పూర్వకంగా కలిసి జకార్డ్ యంత్రం పనితీరును వివరించారు. ఈ సందర్భంగా తయారు చేసిన చీరలను చూపించడంతో కేటీఆర్ వారిని అభినందించారు.

జకార్డ్ యం త్రంతో పట్టు చీరల తయారీ విధానాన్ని నమస్తే తెలంగాణ పత్రికలో చూశానని చెప్పారు. వెంటనే జిల్లా చేనేత జౌళి శాఖ ఏడీ అశోక్‌రావుకు కావాల్సిన ప్రోత్సాహకం,అవసరమయ్యే వారికి యం త్రాలను అందించేలా ఏర్పాట్లు చేయాలని సూ చించారు. త్వరలోనే కంపెనీ ప్రతినిధులు, అధికారులు, ఔత్సాహికులతో కలిసి మేళా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...